చిత్రం చెప్పే విశేషాలు..!

(18-09-2022/1)

ఏపీలోని ప్రధాన దేవాలయాల్లో విశాఖలోని సింహాచలం అప్పన్న ఆలయం ఒకటి. నిత్యం భక్తులు మెట్ల మార్గంలో పసుపు, కుంకుమ రాస్తూ కొండపైకి వెళుతుంటారు. ఇంతటి కీలకమైన మెట్ల మార్గం ఇటీవల కురిసిన వర్షాలకు అధ్వానంగా మారింది. పలుచోట్ల నాచుపట్టి దారుణంగా తయారైంది.

Source: Eenadu

విశాఖ చినముషిడివాడకు చెందిన షబ్బీర్‌ అహ్మద్‌ తన ఆలోచనను ఆచరణలోకి తీసుకువచ్చి ఉపాధి పొందుతున్నారు. విశాఖ నుంచి అరకు వెళ్లే దారిలో వాహనాలు ఆగిపోయినప్పుడు షబ్బీర్‌కు ఫోన్‌ చేస్తే.. తను తయారు చేసుకున్న రిక్షాలో వెళ్లి మరమ్మతు చేస్తున్నాడు.

Source: Eenadu

విజయవాడ నుంచి అమరావతి సచివాలయానికి వెళ్లే దారి దుస్థితి ఇది. ఉండవల్లి కరకట్ట మీద దారి రెండు వైపులా కుంగిపోయి.. గుంతలు పడింది. సీడ్‌ యాక్సిస్‌ రోడ్డుపై మట్టి పేరుకుపోయింది. దుమ్ము లేస్తోంది. దీన్నుంచి మందడంలోకి వెళ్లే దారి గుంతలు పడింది.

Source: Eenadu

నీటిపారుదల శాఖ అధికారులు నిర్లక్ష్యాన్ని వీడటం లేదు. పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ పరిస్థితి చూస్తే ఇదీ అర్థమవుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు 6వ ప్యాకేజీ పరిధిలోని కృష్ణా జిల్లా గన్నవరం మండలం గొల్లనపల్లి గ్రామంలో కాలువ లైనింగ్‌ కొట్టుకుపోయింది.

Source: Eenadu

ప్రకృతి ప్రసాదిత కొండలు విశాఖ మహానగరంలో ఎంతో ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఓ వైపు గిరులు.. వాటి పక్కనే భారీ బహుళ అంతస్తులు కనువిందు చేస్తుంటాయి. సింహాచలంలోని అప్పన్న కొండ శిఖరానికి చేరుకొని చూస్తే తూర్పు కనుమల్లో ఒదిగిన మధురవాడ ప్రాంతం ముచ్చటగొలుపుతోంది.

Source: Eenadu

ముతక రకం పాలిస్టర్‌, కాటన్‌ ఉత్పత్తుల స్థానంలోనే సిరిసిల్ల నేతన్నలు సరైన నైపుణ్యం, పట్టుదలతో కొత్త ఆవిష్కరణలు తీసుకువస్తున్నారు. ఇందుకోసం సాధారణ మరమగ్గాలకు డాబీ, జకార్డు పరికరాలు అమర్చి సూచించిన డిజైన్లలో పట్టు వస్త్రాలు నేస్తున్నారు.

Source: Eenadu

ఈ ఆదివారం కోడి కూరలోకి కొత్తిమీర లేకుండా సరిపెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఈ ఆకు సరఫరా తగ్గి.. ధర కొండెక్కి కూర్చుంది. సాధారణంగా కిలో రూ.80 నుంచి రూ.100 ఉండే కొత్తిమీర.. ప్రస్తుతం రూ.400 పలుకుతోంది.

Source: Eenadu

విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో శనివారం ప్రదర్శించిన నందనార్‌ చరితం నృత్యరూపకం ఆకట్టుకుంది. అందులో భాగంగా శివతాండవం చేస్తున్న దీపానారాయణన్‌ సషీంద్రన్‌.

Source: Eenadu

చిత్రం చెప్పే విశేషాలు!(27-11-2022/2)

చిత్రం చెప్పే విశేషాలు..!(27/11/2022/1)

భారత రాజ్యాంగం అమలు ఎలా జరిగిందంటే...!

Eenadu.net Home