చిత్రం చెప్పే విశేషాలు..! (18-09-2022/2)

త్వరలో టీ20 వరల్డ్‌కప్‌ ఆడనున్న భారత క్రికెటర్ల కోసం బీసీసీఐ నూతన జెర్సీని తీసుకువచ్చింది. బీసీసీఐ ట్విటర్‌లో పోస్టు చేసిన ఈ టీ20 జెర్సీ ఫొటో ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Image:Eenadu

హైదరాబాద్‌లోని పీవీ నరసింహారావు మార్గ్‌లో ఈట్‌ స్ట్రీట్‌ పక్కన అబ్కారీ శాఖ ఆధ్వర్యంలో హైటెక్‌ నీరా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దసరాకు ప్రారంభిద్దామనుకుంటున్న ఈ నీరా దుకాణం ఎదుట ఆర్టీఫిషియల్‌ తాటి చెట్లకు తుది మెరుగులు దిద్దుతున్నారు.

Image:Eenadu

సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్‌ గార్డెన్స్‌లో ఆదివారం ‘నవరాత్రి ఉత్సవ్ 2022’ దాండియా ధమాల్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు దాండియా ఆడుతూ సందడి చేశారు.

Image:Eenadu

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా భువనేశ్వర్‌కు చెందిన కళాకారిణి ప్రియాంక సహానీ బాదం పప్పులపై ప్రధాని జీవితంలో వివిధ దశలకు చెందిన చిత్రాలను తీర్చిదిద్ది జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Image:Eenadu

హైదరాబాద్‌ నగరంలోని జూబ్లీహిల్స్‌లో దసరా పండగ సందర్భంగా ముందస్తు నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సోషలైట్‌ బినా మెహతా పలువురు మహిళలతో కలిసి గార్బా నృత్య ప్రదర్శన, దాండియా ఆటలు ఆడి సందడి చేశారు.

Image:Eenadu

లండన్‌ పార్లమెంటు కాంప్లెక్స్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ హాలులో రాణి ఎలిజబెత్-2 శవపేటిక ఉంచారు. పలువురు ఆ ప్రదేశానికి తరలివచ్చి రాణికి నివాళులర్పించారు.

Image:Eenadu

మరి కొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌లో కొందరు యువతులు సంప్రదాయ గార్బా నృత్యం సాధన చేస్తూ కనిపించారు. నవరాత్రి ఉత్సవాల్లో ప్రదర్శన ఇచ్చేందుకు వీరంతా సన్నద్ధమవుతున్నారు.

Image:Eenadu

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం లండన్‌లోని లాన్సెస్టర్‌ హౌస్‌లో బ్రిటన్‌ క్వీన్‌ ఎలిజబెత్‌2 మృతికి సంతాపంగా బుక్‌ ఆఫ్ కండోలెన్సెస్‌లో సంతకం చేసి నివాళి అర్పించారు.

Image:Eenadu

తైవాన్‌లో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. దీంతో అక్కడి హువేలియన్‌ కౌంటీలో భారీ భవనాలు కుప్పకూలాయి. ఈ ఘటనతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

Image:Eenadu

చిత్రం చెప్పే విశేషాలు!(27-11-2022/2)

చిత్రం చెప్పే విశేషాలు..!(27/11/2022/1)

భారత రాజ్యాంగం అమలు ఎలా జరిగిందంటే...!

Eenadu.net Home