చిత్రం చెప్పే విశేషాలు...!

(19-09-2022/2)

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్ 2 అంత్యక్రియల్లో పాల్గొనేందుకు లండన్‌ వెళ్లిన భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కింగ్ ఛార్లెస్‌ 3ను పరామర్శించారు. బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో ఆయనను కలిసి రాణి మృతిపట్ల సంతాపం తెలిపారు.

Source: Eenadu

తిరుమలలో ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సుతో ట్రయల్ రన్‌ నిర్వహించారు. ఆర్టీసీ నిపుణులు అందులో ప్రయాణిస్తూ తిరుపతి నుంచి రెండో కనుమ దారి గుండా తిరుమలకు చేరుకున్నారు. ఎత్తైన ప్రదేశాలు, మలుపుల వద్ద బస్సు పనితీరును పరిశీలించారు.

Source: Eenadu

హైదరాబాద్ నగరంలోని పార్కుల్లో సందర్శకులను ఆకట్టుకొనేందుకు వైవిధ్యమైన బల్లలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందిరా పార్క్‌లో గుర్రం ఆకారంలో ఈ బల్లను ఏర్పాటు చేయగా.. ఓ చిన్నారి దానిపై ఎక్కి ఇలా మురిసిపోయింది.

Source: Eenadu

హైదరాబాద్‌ తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిర్యాల పెద్దచెరువులో చేప పిల్లలను వదులుతున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

Source: Eenadu

జపాన్‌లో నన్మడొల్‌ తుపాను ప్రభావంతో భారీవర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి అకి తీరంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగిసి పడ్డాయి.

Source: Eenadu

ఫియోనా హరికేన్‌ ప్రభావంతో ప్యూర్టో రికోలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో అక్కడి కెయెలో ఓ ఇల్లు ఇలా వరద నీటిలో మునిగింది. అందులో చిక్కుకున్న ముగ్గురిని కాపాడేందుకు సహాయక దళాలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

Source: Eenadu

హైదరాబాద్‌ నగరంలో సోమవారం సూర్యుడి చుట్టూ వరదగూడు(వరదగుడి) కనిపించి ఆకట్టుకుంది.

Source: Eenadu

దివంగత నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవిని వైఎస్‌ విజయమ్మ పరామర్శించారు. అనంతరం కృష్ణంరాజు చిత్రపటానికి నివాళి అర్పించారు.

Source: Eenadu

అయోధ్య జిల్లాలోని పూర్వ గ్రామంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు గుడి కట్టారు. ఇందులో యోగి బాణం, విల్లుతో రాముడి అవతారంలో ఉండటం విశేషం. అయోధ్యకు చెందిన ప్రభాకర్‌ మౌర్య ఈ ఆలయాన్ని నిర్మించారు.

Source: Eenadu

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అజహరుద్దీన్‌ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. సెప్టెంబర్‌ 25న హైదరాబాద్‌లో జరగనున్న భారత్‌-ఆస్ట్రేలియా టీ20 క్రికెట్‌ మ్యాచ్‌కు ఆమెను ఆహ్వానించారు.

Source: Eenadu

భారత్‌ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కేరళలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో కలిసి స్నేక్ బోట్‌ రోయింగ్‌ రేసులో పాల్గొని సందడి చేశారు.

Source: Eenadu

హీరామండి.. అస్లీ సోనా

మలైకా.. అదిరింది యోగా!

చిత్రం చెప్పే విశేషాలు(26-04-2024/1)

Eenadu.net Home