చిత్రం చెప్పే విశేషాలు..! (20-09-2022/2)

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’లో ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. ఆయనతో కలిసి నడుస్తూ యాత్రకు వస్తున్న స్పందనపై చర్చించారు. జోడో యాత్ర విజయవంతంగా సాగడం భారత భవిష్యత్ రాజకీయ మార్పులకు సంకేతమని సీతక్క అన్నారు.

Image:Eenadu

హైదరాబాద్‌ హైటెక్‌సిటీలోని ఇనార్బిట్‌మాల్‌ బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌లో ‘వివో వి25(5జీ)’ నూతన ఫోన్‌ను విడుదల చేశారు. ‘మిస్‌ దివా సుప్రా నేషనల్‌ 2022’ ప్రజ్ఞ అయ్యంగారి ఈ కలర్‌ ఛేంజింగ్‌ టెక్నాలజీ ఫోన్‌ను ఆవిష్కరించారు.

Image:Eenadu

పచ్చని లతలు అల్లుకొని కన్పిస్తున్న ఈ ద్వారం ఒకటి తెలంగాణ శాసన మండలికి వెళ్లేది కాగా.. మరోటి శాసనసభకు వెళ్లేది. పబ్లిక్‌ గార్డెన్స్ వద్దనున్న ఈ తీగల ప్రవేశ ద్వారం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Image:Eenadu

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించే దసరా మహోత్సవాలకు హాజరు కావాలని కోరుతూ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులకు ఆలయ అధికారుల ఆహ్వానం అందించారు.

Image:Eenadu

తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని తితిదే వైభవంగా నిర్వహించింది. తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అధికారులు, వేదపండితులు కలిసి ఆలయాన్ని శుద్ధి చేశారు.

Image:Eenadu 

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ కేరళలో సాగుతోంది. ఆయన యాత్రకు మేళం మ్యాస్ట్రోగా పేరొందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత పెరువనమ్‌ కుట్టన్‌ మారర్‌ తన బృందంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాహుల్ డోలు వాయిద్యాన్ని పరిశీలించారు. 

Image:Eenadu

హైదరాబాద్‌లోని సంతోశ్‌నగర్‌ డివిజన్‌ రియాసత్‌నగర్‌లో ప్రధాన రహదారిపై ఉన్న చేతిపంపు గత పదిహేను సంవత్సరాల నుంచి ఉపయోగంలో లేదు. వాహనదారులు ఎటు వెళ్లాలన్నా మధ్యలో ఈ బోరు ఇబ్బందికరంగా మారి ప్రమాదాలు జరుగుతుండటంతో దీన్ని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

Image:Eenadu

మొహాలి వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌ ప్రారంభమైంది. భారత జట్టు అభిమానులు సందడి చేస్తూ మ్యాచ్‌ను వీక్షిస్తున్నారు.

Image:Eenadu

గమనిక: ఇది ప్రయత్నించకండి

బాక్సర్‌ మీనాక్షి

ఈవీఎంలు ఇలా పుట్టుకొచ్చాయి!

Eenadu.net Home