చిత్రం చెప్పే విశేషాలు..! (21-09-2022/2)

భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన నాలుగో విడత ప్రజా సంగ్రామయాత్ర హైదరాబాద్‌లోని నాగోలులో కొనసాగుతోంది. ఈ సందర్భంగా గొల్లకురుమలు ఆయన్ను కంబలి, గొర్రెపిల్లతో సత్కరించారు.

Image:Eenadu

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా తిరుపతిలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 2కె రన్ నిర్వహించారు. అలిపిరి నుంచి శ్రీహరిధామం వరకు ఈ పరుగు కొనసాగింది.

Image:Eenadu

కర్ణాటకలో భాజపా ప్రభుత్వం అవినీతి చేస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ వినూత్న రీతిలో నిరసన తెలుపుతోంది. బెంగళూరులో ‘పే సీఎం’ పేరుతో గోడప్రతులను అంటించింది. ‘40 శాతం తీసుకుంటాం’ అంటూ వాటిపై రాయడంతో పాటు క్యూఆర్‌ కోడ్‌, సీఎం బసవరాజ్‌ బొమ్మై ఫొటోలను జత చేసింది.

Image:Eenadu

ఈ నెల 25న భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్‌ స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌ టికెట్ల జారీలో జాప్యంపై క్రికెట్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్ (హెచ్‌సీఏ) వైఖరికి నిరసనగా నగరంలోని జింఖానా మైదానం వద్ద ఆందోళనకు దిగారు.

Image:Eenadu

ఆస్ట్రేలియాలోని స్ట్రహాన్‌ సమీప ఓషియన్‌ బీచ్‌లో దాదాపు రెండొందలకు పైగా వేల్స్‌ నిస్సహాయ స్థితిలో పడి ఉన్నాయి. వీటి పరిస్థితికి గల కారణాలు తెలియరాలేదు. పలు స్వచ్ఛంద సంస్థల సభ్యులు ఈ వేల్స్‌కు వైద్యసహాయం అందించి కాపాడేందుకు యత్నిస్తున్నారు.

Image:Eenadu

జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌ నగరంలో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఆకాశాన్ని తాకేంత ఎత్తులో ఉన్న భారీ భవంతుల చుట్టూ సగానికి దట్టమైన పొగమంచు పడుతూ కనిపించింది. దీంతో చూపరులకు ‘మేఘాల్లోనే భవనాలు నిర్మించారా?’ అనే సందేహం కలిగింది.

Image:Eenadu

అక్కినేని నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ది ఘోస్ట్‌’. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను సెప్టెంబర్‌ 25న కర్నూలులో నిర్వహించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ‘ది ఘోస్ట్‌’ అక్టోబర్‌ 5న థియేటర్లలో విడుదల కానుంది.

Image:Eenadu

నీలిచిత్రాలు చూడొద్దని యువతకు సందేశమిస్తూ బోపాల్‌లోని ఓ పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించే రిషీ శుక్లా సైకిల్‌ యాత్ర చేపట్టాడు. సుమారు 2,800 కిలోమీటర్లు ప్రయాణించి ఒంగోలు చేరుకున్నాడు.

Image:Eenadu

అమరావతి రైతుల మహాపాదయాత్ర కృష్ణా జిల్లా చల్లపల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా వారు స్థానికులతో కలిసి పెద్దఎత్తున మువ్వన్నెల జెండాతో ప్రదర్శన చేపట్టారు. అనంతరం అక్కడి గాంధీ విగ్రహం వద్ద అమరాతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని నినాదాలు చేశారు.

Image:Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home