చిత్రం చెప్పే విశేషాలు..!

(22-09-2022/1)

పేదలకు 5 రూపాయలకే అన్నం పెట్టి ఆకలి తీర్చాలని గత తెదేపా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం మారటంతో వాటిని మూసివేశారు. చిత్తూరు జిల్లా కేంద్రంలోని పారిశ్రామికవాడ సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్‌ను సచివాలయ కార్యాలయంగా మార్చారు.

Source: Eenadu

సౌర కుటుంబంలోని నెఫ్ట్యూన్‌ గ్రహమిది. చుట్టూ వలయాలతో మెరిసిపోతున్న ఈ గ్రహం ఫొటోను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా ప్రయోగించిన జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ (జేడబ్ల్యూఎస్‌టీ) తీసింది.

Source: Eenadu

ఉక్రెయిన్‌లోని ఖర్కివ్‌లో బుధవారం రష్యా క్షిపణి దాడులతో ధ్వంసమైన రైలు బోగీలు.

Source: Eenadu

బుధవారం చేగుంటలో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో మండల స్థాయి పోషకాహార వారోత్సవాలు నిర్వహించారు. మహిళలకు అవగాహన కోసం అధికారులు కూరగాయలతో బతుకమ్మ తయారు చేసి ఆసక్తి కలిగేలా వివరించారు. Source: Eenadu

ఈ చిత్రంలో కనిపిస్తున్న కేరళకు చెందిన డాక్టర్‌ ఆనంద్‌ కక్కడ్‌(34) రష్యా రాజధాని మాస్కోలో పేరుగాంచిన ఆయుర్వేద వైద్యుడు. అంతేకాదు.. ఓ యూట్యూబర్, మంచి గాయకుడు. తాజాగా ఆయన సుప్రసిద్ధ గురువాయూర్‌లోని కృష్ణ దేవాలయానికి తదుపరి ప్రధాన అర్చకుడు(మెల్‌శాంతి) కాబోతున్నారు.

Source: Eenadu

ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండ మండలంలోని ఈ పల్లెలో యువసేన సభ్యులు విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాలని సంకల్పించారు. ఓ ఇంటి ఆవరణలో పాఠశాల ప్రారంభించారు. విద్యా వాలంటీరుకు నెలకు రూ.4,000 వంతున వేతనమిస్తున్నారు.

Source: Eenadu

సైబీరియన్‌ కొంగలు... స్థానికంగా కనిపించే తెల్లకొంగలు... నీటికాకులు.. ఇలా రకరకాల పక్షులు ఒకేచోట చేరి చూపరులను ఆకట్టుకుంటున్నాయి. మహబూబాబాద్‌ జిల్లా రామచంద్రాపురం సమీప కుంటలోని చెట్లపై అవి కలసిమెలసి జీవిస్తున్నాయి.

Source: Eenadu

తూప్రాన్‌కు చెందిన ఇద్దరు మహిళలు ఈత చెట్టు ఎక్కి కల్లు తీశారు. బుధవారం తూప్రాన్‌లో కల్లు విక్రయాలకు అనుమతి ఇచ్చేందుకు ఆబ్కారీశాఖ అధికారులు ఈ పరీక్ష నిర్వహించారు. ఇందులో పట్టణానికి చెందిన నిర్మలాగౌడ్, స్రవంతి పాల్గొన్నారు.

Source: Eenadu

చిత్రం చెప్పే విశేషాలు(28-03-2024/2)

చిత్రం చెప్పే విశేషాలు (28-03-2024/1)

చిత్రం చెప్పే విశేషాలు(27-03-2024/1)

Eenadu.net Home