చిత్రం చెప్పే విశేషాలు! (24-07-2022) 

భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. ‘గతేడాది పోటీల వల్ల బోనాల పండగకు రాలేక పోయాను. ఈ సారి అమ్మవారికి బంగారు బోనం సమర్పించడం సంతోషంగా ఉంది. ఏటా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలనుకుంటున్నానని’ చెప్పారు.

#Eenadu

ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా రజతం గెలుచుకున్నాడు. జావెలిన్‌ త్రోలో 88.13 మీటర్ల దూరం విసిరి రజతం దక్కించుకున్నాడు. అండర్సన్‌ పీటర్స్‌(గ్రెనెడా) 90.54 మీటర్లు విసిరి స్వర్ణం సాధించాడు. #Eenadu

రాజ్‌భవన్‌లో శనివారం నిర్వహించిన ఆషాఢ బోనాల ఉత్సవాల సందర్భంగా బోనం ఎత్తుకుని నల్లపోచమ్మ ఆలయానికి ఊరేగింపుగా వెళ్తున్న గవర్నర్‌ తమిళిసై. 

#Eenadu


సోనియాగాంధీని ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ యువజన కాంగ్రెస్‌ వినూత్న రీతిలో నిరసన తెలిపింది.శనివారం గాంధీభవన్‌లో రాళ్ల ఉప్పుతో సోనియా చిత్రపటాన్ని వేశారు. పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీ గౌడ్‌ చిత్రకారుడు పురుషోత్తాన్ని అభినందించారు. #Eenadu

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌ శివారులోని బుర్కగుట్టపై కొత్త తెలంగాణ చరిత్ర బృందం పురాతన రాతి చిత్రాలను గుర్తించింది. వాటిలో తేలు, వృత్తాలు, చేతులు పైకెత్తిన మనిషిరూపం కనిపిస్తున్నాయని, కొన్ని చిత్రాలు గుర్తించేందుకు వీలుగా లేవని పేర్కొంది.

#Eenadu

విజయవాడలోని రామవరప్పాడు రింగు నుంచి రమేష్‌ ఆసుపత్రి కూడలి వరకు జాతీయరహదారి- సర్వీసురోడ్డుకు మధ్యలో గతంలో వాకింగ్‌ట్రాక్‌ను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం నిర్వహణ సరిగా లేకపోవడంతో వాకింగ్‌ట్రాక్‌పై ఎక్కడ చూసిన పాముల పుట్టలే దర్శనమిస్తున్నాయి.

#Eenadu

ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకున్నా విద్యుత్తు సదుపాయం లేకపోవడం గిరిజనుల పాలిట శాపంగా మారింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు గుడారాలు, పాకలు కూలిపోవడంతో విద్యుత్‌లేకున్నా చీకట్లోనే చంటిపిల్లలతో కాలం వెళ్లదీస్తున్నారు. విజయవాడకు సమీపంలో ఉన్న జక్కంపూడిలో గిరిజనుల దీనావస్థ ఇది.

#Eenadu


కంచికచర్ల - పెద్దాపురం ఆర్‌అండ్‌బీ రహదారి భారీ గుంతలు ఏర్పడి అధ్వానంగా తయారైంది. శుక్రవారం కురిసిన వర్షానికి జుజ్జూరు గ్రామంలో రహదారి చెరువుని తలపించింది. శనివారం ఆ గుంతల్లోంచి వెళ్లిన ఇబ్రహీంపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కొంతసేపు ఆగిపోయింది.

#Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home