చిత్రం చెప్పే విశేషాలు..!

(11-08-2022/2)

హైదరాబాద్‌లోని ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అనాథ చిన్నారుల మధ్య రాఖీ పౌర్ణమి వేడుకలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు, మహిళలు ఆయనకు రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు.

Source: Eenadu

సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని తారామతి బారాదారిలో ‘రాఖీ విత్ సోల్జర్స్’ కార్యక్రమం నిర్వహించారు. 150 మంది జవాన్లకు 60 మంది కళాశాల విద్యార్థినులు రాఖీలు కట్టి.. మిఠాయిలు తినిపించారు.

Source: Eenadu

ఎగువన కృష్ణా పరివాహక ప్రాంతాల నుంచి వరద ఉద్ధృతి పెరగడంతో శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్న దృశ్యాలను తిలకించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.

Source: Eenadu

రక్షాబంధన్‌ పర్వదినం పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీకి పలువురు చిన్నారులు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

Source: Eenadu

ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా గురువారం కరీంనగర్‌లో విద్యార్థులు జాతీయ జెండాలతో పెద్దఎత్తున ర్యాలీ తీశారు.

Source: Eenadu

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా పాఠశాల విద్యార్థులు కర్నూలులోని కృష్ణానగర్‌ నుంచి కొండారెడ్డి బురుజు వరకు 500మీటర్ల భారీ జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహించారు.

Source: Eenadu

వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా కొడంగల్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె అక్కడి వ్యవసాయ కూలీలతో కలిసి వరి నాట్లు వేసి కార్యకర్తల్లో జోష్‌ పెంచారు.

Source: Eenadu

రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా మంత్రులు తానేటి వనిత, విడదల రజనీ తదితరులు సీఎం జగన్‌కి రాఖీ కట్టారు. మరోవైపు ఈశ్వరీయ బ్రహ్మకూమారి ప్రతినిధి రాజయోగిని బ్రహ్మకుమారి శాంత దీదీజీ జగన్‌కు రాఖీ కట్టి పండగ శుభాకాంక్షలు తెలిపారు.

Source: Eenadu

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో హైలైఫ్‌ ఎగ్జిబిషన్‌ కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

Source: Eenadu

మెహదీపట్నం రైతుబజార్ పరిసరాల్లోని పండ్ల వ్యాపారులంతా భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా తమ తోపుడు బండ్లపై జాతీయ జెండాలను కట్టుకొని దేశభక్తిని చాటుతున్నారు. ప్రధాన రహదారి మార్గంలో వెళ్లే వారంతా దీన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు.

Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

వదిలేయాల్సింది మీ కలలను కాదు

Eenadu.net Home