చిత్రం చెప్పే విశేషాలు..! (22-09-2022/2)

‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 850 మంది విద్యార్థులకు డిజిటల్‌ ట్యాబ్‌లను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు మంత్రితో కలిసి సంబరంగా సెల్ఫీలు తీసుకున్నారు.

Image:Eenadu

 మంత్రి, సినీనటి రోజా విజయవాడ కనకదుర్గను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అధికారులు ఆమెకు లాంఛనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను మంత్రికి అందజేశారు.

Image:Eenadu

సినీ నటి షిర్లీ సేథియా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం సినీనటులు విక్టరీ వెంకటేశ్‌, రాజ్‌కుమార్‌రావు, శిల్పాశెట్టిలను ఆమె ఛాలెంజ్‌కు నామినేట్‌ చేశారు. నాగశౌర్య, షిర్లీ సేథియా జంటగా నటించిన ‘కృష్ణ వ్రింద విహారి’ ఈ నెల 23న విడుదల కానుంది.

Image:Eenadu

ప్యూర్టోరికోలోని సలినాస్‌లో ఫియోనా హరికేన్‌ ప్రభావంతో భారీవర్షాలు కురిశాయి. దీంతో ఓ ఇల్లు ఇలా పునాదితో సహా కుంగిపోయింది.

Image:Eenadu

అఫ్గాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొంది. దీంతో తమ చిన్నారులను పోషించుకోలేక పలువురు తల్లిదండ్రులు వారిని పనిలోకి తీసుకెళ్తున్నారు. కాబుల్‌ శివారులో నిర్వహిస్తున్న ఇటుక బట్టీల్లో పని చేస్తున్న పిల్లలు వీరు.

Image:Eenadu

సినీ నటి ప్రియాంక చోప్రా తన కుమార్తె మాల్టీ మేరీతో కలిసి మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్న ఫొటోలను ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు.ప్రియాంక చోప్రా, నిక్‌ జోనాస్‌ దంపతులు సరోగసి పద్ధతిలో బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

Image:Eenadu

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును వైఎస్‌ఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీగా మార్చడాన్ని ఖండిస్తూ తిరుపతి జిల్లాలోని చంద్రగిరి క్లాక్‌ టవర్‌ వద్ద తెదేపా ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పులివర్తి నాని పాల్గొన్నారు.

Image:Eenadu

 ఈ నెల 25న ఉప్పల్‌ స్టేడియంలో భారత్‌-ఆసీస్‌ మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో టికెట్లు విక్రయిస్తున్నారు. టికెట్ల కోసం వేలాదిగా క్రికెట్‌ అభిమానులు తరలిరావడంతో పోలీసులు వారిని నియంత్రించే క్రమంలో అక్కడ స్వల్ప తొక్కిసలాట జరిగింది.

Image:Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home