చిత్రం చెప్పే విశేషాలు..! (23-09-2022/2)

సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. సీజేఐగా పదవీ విరమణ చేశాక ఆయన తొలిసారి హైదరాబాద్‌కు వచ్చారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ సహా పలువురు న్యాయమూర్తులు ఘనస్వాగతం పలికారు.

#Eenadu

శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నెల్లూరు నగరంలోని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అష్టాదశ శోభాయాత్ర శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఈ సందర్భంగా వేద పండితులు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

#Eenadu

తిరుమలలోని మొదటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద పునర్నిర్మించిన పార్కును తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి కలిసి ప్రారంభించారు. సుందరంగా తీర్చిదిద్దిన ఈ పార్కు పరిసరాలు యాత్రికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

#Eenadu

ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కిన సినిమా ‘ది ఘోస్ట్‌’. ఈ నెల 25న కర్నూలులో నిర్వహించనున్న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు నాగచైతన్య, అఖిల్‌ హాజరవుతున్నట్లు చిత్రబృందం తెలిపింది. ‘ది ఘోస్ట్‌’ అక్టోబర్‌ 5న థియేటర్లలో విడుదల కానుంది.

#Eenadu

సోమాజీగూడలోని విద్యుత్‌ సౌదలో ఉన్న వాటర్‌ ఫౌంటెన్‌లో ఇటీవల జాతీయ జెండా రంగులతో డిజైనర్‌ చిత్రాలు ఏర్పాటు చేశారు. వీటిని చూసి పలువురు నగరవాసులు ముగ్ధులవుతున్నారు.

#Eenadu

ఇటీవల రిటైర్మెంట్‌ ప్రకటించిన టెన్నిస్‌ క్రీడాకారుడు రోజర్‌ ఫెదరర్‌ గురువారం రాత్రి లావర్ కప్ ప్రారంభోత్సవం సందర్భంగా జకోవిచ్‌, రాఫెల్ నాదల్, ఆండీ ముర్రేలతోకలిసి లండన్‌లో కలియతిరిగారు. అక్కడి లండన్ బ్రిడ్జి వద్ద కలిసి దిగిన ఫొటోను ఫెదరర్‌ తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు.

#Eenadu

చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడో విడత వైఎస్‌ఆర్‌ చేయూత నిధులను విడుదల చేశారు. మొత్తంగా 26.39 లక్షల మందికి రూ.4,949 కోట్ల నిధులను నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు.

#Eenadu

మిస్‌ యూనివర్స్‌ హర్నాజ్‌ సంధు న్యూయార్క్‌ వీధుల్లో తెలుపు దుస్తుల్లో సందడి చేసిన ఫొటోలను తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. ఈ ఫొటోలకు ఆమె ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.

#Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home