చిత్రం చెప్పే విశేషాలు!
(25-09-2022/1)
ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన ఈ పాఠశాలపై పిచ్చి మొక్కలు పెరిగి చెట్లుగా మారుతుండటంతో భవన గోడలు బీటలు వారి కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. మండల కేంద్రంలోని ధరణికోట ప్రాథమిక పాఠశాల భవనం పరిస్థితి ఇది.
Source: Eenadu
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధమవుతోంది. ప్రధాన రహదారులు, ఉద్యానవనాలు, స్వామివారి ఆలయం వద్ద విద్యుత్ అలంకరణలు పూర్తయి కాంతులీనుతోంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధమవుతోంది.
Source: Eenadu
ఫెదరర్, నాదల్.. టెన్నిస్ కోర్టులో విజయం కోసం ప్రాణం పెట్టి పోరాడిన వీరులు. లండన్‌లో ఫెదరర్ చివరి మ్యాచ్ ఆడిన తర్వాత.. ఇలా ఈ ఇద్దరూ కలిసి కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యం.. టెన్నిస్ ప్రపంచాన్ని కదిలించింది.
Source: Eenadu
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని గజ్వేల్‌కు చెందిన రామకోటి భక్త సమాజం వ్యవస్థాపకుడు రామకోటి రామరాజు శనివారం నవ ధాన్యాలతో 12 అడుగుల భారీ బతుకమ్మను తీర్చిదిద్దారు. తెలంగాణ ఆడబిడ్డలకు దీన్ని అంకితమిస్తున్నట్లు వెల్లడించారు.
Source: Eenadu
రాజమహేంద్రవరంలో గోదావరి వరద స్వల్పంగా పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద శనివారం సాయంత్రం 6 గంటలకు నీటి మట్టం 10.10 అడుగులకు చేరింది. దీంతో 5,96,719 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
Source: Eenadu
మండల కేంద్రమైన మక్కువలో మూడు రోజులుగా రక్షిత మంచినీటి పథకం ద్వారా సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు ఇళ్లలోని బోర్ల నీటిని వినియోగిస్తుండగా.. మిగిలిన వారు సమీపంలోని సువర్ణముఖి నదికి వెళ్లి తెచ్చుకుంటున్నారు.
Source: Eenadu
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం లోసంగి గిరిజన గ్రామంలో మౌస్‌డీర్ పిల్లను నర్సీపట్నం అటవీ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. రెండు నెలల వయసున్న ఈ మౌస్‌డీర్ అరుదైనదని డీఎఫ్‌ఓ తెలిపారు.
Source: Eenadu
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో దుర్గా పూజ కోసం సిద్ధమవుతున్న మండపం
Source: Eenadu