చిత్రం చెప్పే విశేషాలు!

(26-09-2022/1)

ఒకప్పుడు సాగు నీరందించిన ఈ కాలువ ఇప్పుడు నగర మురుగును తీసుకెళ్లే డ్రైనేజీగా మారిపోయింది. వర్షాలు వస్తే తూముల వద్ద వ్యర్థాలు అన్నీ పోగయి వరదనూ కదలనివ్వడం లేదు. ఇదీ.. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు నగరంలోని సర్వేపల్లి కాలువ దుస్థితి.

Source: Eenadu

కవ్వాల్‌ టైగర్‌ రిజర్వులో ఓ చెట్టుపై కూర్చుని ఊసులాడుకుంటున్న కొండెంగల చిత్రాల్ని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ తన కెమెరాలో బంధించారు. పొడవాటి వీటి తోకలు చెట్టు రంగులో కలిసిపోయి నేలను తాకుతున్నట్లు కనిపించాయి.

Source: Eenadu

హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై నిలిపి ఉంచిన ఈ బస్సు నగరంలో మహిళల కోసం ఏర్పాటు చేసిన సంచార మరుగుదొడ్డి. ఈ ఆధునిక బస్సులు వీఐపీల కోసమేనేమో అనే అనుమానంతో సాధారణ మహిళలు ఉపయోగించడానికి జంకుతుండడంతో బస్సు సిబ్బంది అక్కడి మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు.

Source: Eenadu

పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో నాణేల ఇతివృత్తంతో ఏర్పాటు చేసిన దుర్గా పూజ మండపాన్ని ఆదివారం ప్రారంభించిన అనంతరం అమ్మవారికి పూజలు చేస్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.

Source: Eenadu

వాగు ఒడ్డున ఈ బండలను చూస్తే ఒక దానిపై ఒకటి పేర్చినట్లు ఉన్నాయి. వాస్తవానికి వాగు నీరు.. వర్షం.. కారణంగా కోతకు గురై బండలు ఇలా పేర్చినట్లుగా కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్‌ గ్రామీణ మండలంలోని చిద్దరి, సేవాదాస్‌నగర్‌ గ్రామాల మధ్య ప్రవహించే వాగుపై ఈ బండలు కనిపిస్తున్నాయి.

Source: Eenadu

సాధారణంగా కోడి పెట్టలు మాత్రమే పిల్లల సంరక్షణను చూస్తుంటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో ఓ కోడి పుంజు పిల్లలను కంటికి రెప్పలా రక్షిస్తుండటం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. Source: Eenadu

ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురానికి చెందిన ముడిగె రాజు అనే రైతు పొలం దున్నిన తర్వాత తిరుగు ప్రయాణంలో ఎడ్లబండిని తానే కిలోమీటరు వరకు లాక్కెళ్లాడు. కాడెద్దులు రోడ్డుకు ఇరువైపులా ఉన్న పచ్చిగడ్డిని మేసుకుంటూ వచ్చాయి.

Source: Eenadu

చెరువులవెనం, తాజంగి, లంబసింగిలో ఆదివారం పర్యటకుల సందడి నెలకొంది. దూర ప్రాంతాల నుంచి ఇక్కడి అందాలు ఆస్వాదించేందుకు సందర్శకులు తరలివచ్చారు. శీతాకాలం ప్రారంభం కావడంతో పర్యటకుల తాకిడి పెరుగుతోంది.

Source: Eenadu

చిత్రం చెప్పే విశేషాలు!(27-11-2022/2)

చిత్రం చెప్పే విశేషాలు..!(27/11/2022/1)

భారత రాజ్యాంగం అమలు ఎలా జరిగిందంటే...!

Eenadu.net Home