చిత్రం చెప్పే విశేషాలు..!
(27-09-2022/1)
గ్రాసం కోసి గేదెకు పెడుతున్నట్లుంది కదూ చిత్రం చూస్తే.. గచ్చిబౌలి ఐఎస్‌బీ పరిపాలనా భవనం వద్ద అలంకరణ కోసం ఏర్పాటు చేసిన బొమ్మ వద్ద మహిళ గడ్డి కోస్తుండగా కనిపించిందిలా.
Source: Eenadu
నిలిపి ఉంచిన స్కూటర్లు కావివి. గోడకు అతికించినవి. సికింద్రాబాద్ కర్బల మైదానంలో ఉన్న ఓ హోటల్ ముందు కౌంటర్‌కి ఇలా స్కూటర్ విడిభాగాలను తెచ్చి అమర్చారు.
Source: Eenadu
రాజమహేంద్రవరంలోని దేవీచౌక్‌లో దసరా ఉత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు స్వర్ణకవచ కనకదుర్గగా అమ్మవారిని అలంకరించి హారతులిచ్చారు.
Source: Eenadu
ముంబయిలో రహదారిపై పడిన గుంతలకు సోమవారం రంగులు వేస్తున్న ‘వాచ్‌డాగ్ ఫౌండేషన్’ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు. రహదారులపై ఏర్పడిన గుంతలపై స్థానిక అధికారులు స్పందించేలా చేసేందుకే తాము ఈ కార్యక్రమం చేపట్టామని ఆ సంస్థ వెల్లడించింది.
Source: Eenadu
హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా సంగీత విభావరి, చేనేత ప్రదర్శన, వివిధ రకాల బిర్యానీలను అక్కడ ఉంచారు.
Source: Eenadu
తెలంగాణలో వివిధ జిల్లాల్లో బతుకమ్మ పండగను ఘనంగా నిర్వహించారు. యువతులు, మహిళలు పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ ఆడిపాడారు. గోల్కొండ కోటలో బతుకమ్మ సంబరాల చిత్రమిది.
Source: Eenadu
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమయమై వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
Source: Eenadu
హైదరాబాద్ పంజాగుట్టలోని మానేపల్లి జ్యువెల్లర్స్‌లో ఆభరణాలకు సంబంధించిన కర్టెన్‌రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మోడల్స్ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
Source: Eenadu