చిత్రం చెప్పే విశేషాలు!

(28-09-2022/2)

తెలంగాణ అసెంబ్లీలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, సురభి వాణిదేవి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొని పూల బతుకమ్మల చుట్టూ పాటలు పాడారు.

Source: Eenadu

భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్‌ సందర్భంగా తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియం బయట ఫ్యాన్స్‌ ధోనీ, కోహ్లీ, రోహిత్‌ శర్మల భారీ కటౌట్‌లను ఏర్పాటు చేశారు.

Source: Eenadu

శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం ముండ్లా గ్రామంలోని దుర్యోదన చౌదరీ ఇంట్లోకి బుధవారం 12 అడుగుల కింగ్‌ కోబ్రా ప్రవేశించింది. దీంతో వారు పాములు పట్టే వ్యక్తి బాలరాజుకు ఫోన్‌ చేయగా.. పామును చాకచక్యంగా పట్టుకొని అడవిలో విడిచిపెట్టారు.

Source: Eenadu

హైదరాబాద్‌లోని పంజాగుట్టలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ నగల దుకాణాన్ని సినీ నటి మెహరీన్‌ ప్రారంభించారు. అనంతరం ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

Source: Eenadu

ప్రముఖ నటుడు అనుపమ్‌ ఖేర్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధును ఆమె నివాసంలో కలిశారు. ఈ ఫొటోను సింధు తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. అనుపమ్‌ ఖేర్‌లాంటి గొప్పనటుడిని కలవడం తన అదృష్టమని తెలుపుతూ పోస్టు పెట్టారు.

Source: Eenadu

హైదరాబాద్‌లోని ఆంధ్ర మహిళా సభ కళాశాలలో బుధవారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ ఆడిపాడుతూ సందడి చేశారు..

Source: Eenadu

శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు వరంగల్‌లోని శ్రీ భద్రకాళి అమ్మవారు.. గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు.

Source: Eenadu

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ఇవాళ కేరళలోని పాలక్కడ్ నుంచి ప్రారంభమైంది. పాదయాత్రలో తన వద్దకు వచ్చిన ఓ చిన్నారిని రాహుల్ ఇలా భుజాలపైకి ఎత్తుకున్నారు. ఆపై యాత్ర కొనసాగించారు.

Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home