చిత్రం చెప్పే విశేషాలు..!
(04-10-2022/2)
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు రథోత్సవం వేడుకగా నిర్వహించారు.
Source: Eenadu
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదోరోజు మహిషాసుర మర్దనిగా దుర్గమ్మ దర్శనమిచ్చారు.
Source: Eenadu
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో నిర్వహించిన దసరా నవరాత్రి వేడుకలో ఓ వ్యక్తి ఇలా నాగదేవతను పోలిన ఆకారాన్ని తన శరీరం చుట్టూ తగిలించుకున్నాడు. ఆపై ప్రమిదల వెలుగులతో విన్యాసాలు చేయగా.. పలువురు ఆసక్తిగా తిలకించారు.
Source: Eenadu
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఫోలీసులు ప్రవేశపెట్టిన ఆపరేషన్ ‘రోప్’ సత్ఫలితాలనిస్తోంది. జరిమానాలు చెల్లించడం కంటే నిబంధనలు పాటించడం మేలని అంతా స్టాప్‌లైన్ ముందే ఆగిపోతున్నారు.
Source: Eenadu
సద్దుల బతుకమ్మ వేడుక నేపథ్యంలో సోమవారం రాత్రి హుస్సేన్‌సాగర్లో భారీగా బతుకమ్మలను నిమజ్జనం చేశారు. దీంతో అక్కడ పూలన్నీ పేరుకుపోయాయి. వాటిని తొలగించే పనిలో పారిశుద్ధ్య కార్మికులు నిమగ్నమైన చిత్రాలివి.
Source: Eenadu
దసరా నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఆయన సతీమణి కావ్యతో కలిసి జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
Source: Eenadu
దసరా పండగ రోజున తెరాస పార్టీని.. జాతీయ పార్టీగా మారుస్తున్న నేపథ్యంలో వరంగల్‌కు చెందిన ఓ తెరాస నేత హమాలీలకు కోళ్లు, మద్యం సీసాలు పంపిణీ చేశారు. తెరాస నాయకుడు రాజనాల శ్రీహరి వరంగల్ చౌరస్తాలో 200 మంది హమాలీలకు వాటిని పంచిపెట్టారు.
Source: Eenadu
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. సినిమాలో భీమ్ పాత్రలో మెప్పించిన నటుడు ఎన్టీఆర్‌ను తాజాగా జపాన్ మీడియా ప్రతినిధులు ఇంటర్వూ చేశారు.
Source: Eenadu