చిత్రం చెప్పే విశేషాలు..!
(05-10-2022/1)
ఒంగోలులోని గంటపాలెం పార్వతమ్మ ఆలయం వద్ద మంగళవారం అర్ధరాత్రి అమ్మవారి ఊరేగింపు కనుల పండువగా సాగింది. నగరవాసులు వేలాదిగా హాజరై భక్తిశ్రద్ధలతో ఈ వేడుక నిర్వహించారు.
Source: Eenadu
కరీంనగర్‌లో దేవి నవరాత్రోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు మహానవమి సందర్భంగా మహాశక్తి ఆలయంలో మహిషాసురమర్దిని దేవి రూపంలో అమ్మవారు దర్శనమిచ్చారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాత్రి భక్తజన సందోహం మధ్య మహిషాసుర సంహార లీలను ప్రారంభించారు.
Source: Eenadu
దసరా నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి వరకు భక్తులతో కిటకిటలాడుతున్న నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం.
Source: Eenadu
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహానికి తీరని అవమానం జరిగింది.. అనుమతి లేనిచోట నెలకొల్పారంటూ ఆయన విగ్రహాన్ని తొలగించిన గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు దానిని తీసుకువెళ్లి ఓ టాయ్‌లెట్ డబ్బా ఆసరాతో నిలిపి ఉంచడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Source: Eenadu
విజయవాడ కనకదుర్గమ్మకు మొక్కు సమర్పించేందుకు పాదయాత్రగా వచ్చే భవానీలు తీరా గుడి వద్దకు వచ్చాక పడిగాపులు పడాల్సి వస్తోంది. కాళ్లు కాలిపోతున్నా.. రాళ్లు గుచ్చుకొని రక్తం కారుతున్నా.. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు క్యూలైన్లలో నిల్చోవాల్సి వస్తోంది.
Source: Eenadu
మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మంగళవారం సాయంత్రం సరదాగా బుల్లెట్ బండిపై చక్కర్లు కొట్టారు. మనవరాలు, తన వ్యక్తిగత సహాయకుడి కుమారుడితో కలిసి సామాన్యుడిలా నిర్మల్‌లోని శివాజీచౌక్, అక్కడి నుంచి కొండాపూర్ మీదుగా తిరిగి ఇంటికి చేరుకున్నారు.
Source: Eenadu
తెలంగాణలోని ఎమ్మెల్యేలంతా కొలువుదీరే అసెంబ్లీ ఎదురుగా మురుగు తిష్ఠ వేసింది. మూడు వారాలుగా ముక్కుపుటాలు అదురుతున్నా పట్టించుకునే వారు లేక.. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
Source: Eenadu
సింహాచలం అప్పన్న కొండపై మంగళవారం ప్రకృతి అందాలు భక్తులను ఎంతగానో అలరించాయి. ఓ వైపు చిరు జల్లులు... అదే సమయంలో గిరి శిఖరాలను తాకే మేఘాలు....మరో వైపు కొండ పైనుంచి దూకే జలపాతాలు కనువిందు చేశాయి.
Source: Eenadu