చిత్రం చెప్పే విశేషాలు..!

(07-10-2022/2)

విశ్వక్‌సేన్‌, మిథిలా పాల్కర్‌, ఆశా భట్‌ ప్రధాన పాత్రల్లో అశ్వత్‌మారి ముత్తు తెరకెక్కించిన చిత్రం ‘ఓరి దేవుడా’. ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నటీనటులు ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

Source: Eenadu

వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరీకరణతో నూతన భవంతులు వెలిసి హైదరాబాద్‌లోని చిన్న చిన్న కొండలు, గుట్టలు కనుమరుగవుతున్నాయి. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ పరిసరాల్లో కొండలు కనుమరుగు కాగా అలంకారప్రాయంగా మిగిలిన కొన్ని బండరాళ్లను చిత్రంలో చూడవచ్చు.

Source: Eenadu

గుజరాత్‌లోని మొదేరా గ్రామంలో ఇంటింటికీ సౌర పలకలు అమర్చుకున్నారు. ఈ గ్రామాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 9న భారతదేశ మొదటి సోలార్‌ పవర్డ్‌ విలేజ్‌గా ప్రకటించనున్నారు.

Source: Eenadu

శిఖర్‌ ధావన్‌, సంజూ శాంసన్‌, రాహుల్ త్రిపాఠిలతో కలిసి విమానంలో దిగిన ఫొటోను శ్రేయస్‌ అయ్యర్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. కాగా గురువారం లఖ్‌నవూలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్‌ పరాజయం పాలైంది.

Source: Eenadu

రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్‌లోని స్తర్యి-సాల్టివ్‌లో వంతెన ధ్వంసమైంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే స్థానికులు, సైనికులు పడవల్లో సరకులు తెచ్చుకుంటున్నారు.

Source: Eenadu

దక్షిణ కొరియాలోని సియోల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో తైక్వాండో క్రీడాకారులు గాలిలో ప్లేట్లను పగులకొడుతూ అబ్బురపరిచే విన్యాసాలు చేశారు.

Source: Eenadu

అక్షయ్‌కుమార్‌, సత్యదేవ్‌ ప్రధాన పాత్రల్లో అభిషేక్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రామ్ సేతు’. ఫ్యాన్స్‌ తయారు చేసిన పోస్టర్స్‌ను స్ఫూర్తిగా తీసుకొని చిత్రబృందం ఓ నూతన పోస్టర్‌ను విడుదల చేసింది. రామ్‌ సేతు ట్రైలర్‌ను ఈ నెల 11న విడుదల చేయనున్నారు.

Source: Eenadu

నందిగామ నియోజకవర్గం కంచికచర్ల నుంచి పెద్దాపురం వెళ్లే రోడ్డు దుస్థితికి నిదర్శనం ఈ చిత్రాలు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జుజ్జూరు గ్రామంలో వరద నీరు ఇలా నిలిచిపోయింది. దీంతో అటుగా సైకిల్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి ఆ నీటిలో దిగి తన సైకిల్‌ను శుభ్రం చేసుకున్నాడు.

Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home