చిత్రం చెప్పే విశేషాలు! (24-07-2022)

ఇటీవల రాష్ట్రపతిగా ఎన్నికైన ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అమూల్‌ ఈ చిత్రాన్ని రూపొందించింది. దీనిని ఇన్‌స్టాలో పోస్టు చేయగా.. అమూల్ మార్కెటింగ్, సోషియల్‌ టీమ్‌కు అభినందనలు వెల్లువెత్తాయి.

Source:Twitter

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన అభిమాని, సెన్సార్‌ బోర్డు సభ్యుడు అతిమాముల రామకృష్ణ రవీంద్రభారతి వద్ద ఈ చిత్రాన్ని గీయించారు. 40వేల నాణేలతో ఈ కళాకృతిని రూపొందించారు.

Source:Twitter

అంబర్‌పేట నియోజకవర్గంలో నిర్వహించిన బోనాల ఉత్సవానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

Source:Eenadu

లాల్‌దర్వాజ బోనాల వేడుకల్లో వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పాల్గొన్నారు. సింహవాహిని అమ్మవారికి బోనం సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆమె తెలిపారు.

Source:Eenadu

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ రాజ్‌ఘాట్‌ వద్ద మహాత్మాగాంధీకి నివాళి అర్పించారు. రాష్ట్రపతిగా ఆయన పదవీకాలం ముగిసిన నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రతిఒక్కరూ గాంధీ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆయన మార్గంలో నడవాలని సూచించారు.

Source:Twitter


సికింద్రాబాద్‌లోని ఆక్సిజన్‌ పార్కులో చెట్ల వేర్లు, కాండాలతో ఇలా అందమైన కళాఖండాన్ని తీర్చిదిద్దారు. ఈ ఫొటోను తెలంగాణ సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు.

Source:Twitter

తిరుపతిలోని కోదండరామస్వామి ఆలయంలో ఆదివారం పవిత్రోత్సవాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా యాగశాలలో వైదిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.

Source:Eenadu

భారత క్రికెటర్‌ కృనాల్‌ పాండ్య, పంఖూరీ దంపతులకు మగబిడ్డ జన్మించాడు. ఈ చిన్నారికి వారు కవీర్‌ కృనాల్‌ పాండ్య అని నామకరణం చేశారు. చిన్నారితో ఉన్న ఫొటోను కృనాల్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు.

Source:Twitter

మంత్రి కేటీఆర్‌కు వేదం ఫౌండేషన్ ఛైర్మన్, తెరాస నాయకుడు అలిశెట్టి అరవింద్ వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జి వద్ద కార్లపై ‘హ్యాపీ బర్త్‌డే కేటీఆర్’ అంటూ రాసి ప్రదర్శించారు.

Source:Twitter

హైదరాబాద్‌లోని గౌలీగూడ మహాకాళి ఆలయంలో ఆదివారం బోనాల వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో భక్తులు విరాళాలు సమర్పించేందుకు వినూత్నంగా క్యూఆర్ కోడ్‌ స్కానర్‌ ద్వారా ఆన్‌లైన్‌ పేమెంట్లకు అవకాశం కల్పించారు.

Source:Eenadu


స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

వదిలేయాల్సింది మీ కలలను కాదు

Eenadu.net Home