చిత్రం చెప్పే విశేషాలు! (13-08-2022/1)

భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ సంబరాలను ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదివాసీలు అంబరంగా జరుపుకొన్నారు. చించుఘాట్‌ గ్రామంలో శుక్రవారంనిర్వహించిన ర్యాలీలో చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ జాతీయ జెండాలను చేత బూని పాల్గొన్నారు. అనంతరం రైతులతో కలిసి ఓ పంట చేనులో జెండా ఆవిష్కరించారు.

image:Eenadu

ఖమ్మం నగరానికి చెందిన బోలగాని త్రివేది.. రాఖీ కట్టడానికి వచ్చిన తన సోదరికి రూ.56 వేల విలువైన నాణేలతో తులాభారం వేసి ప్రేమాభిమానాలను చాటుకున్నాడు.

image:Eenadu

అడవులను కాపాడుకునేందుకు జగిత్యాల జిల్లాలో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. సారంగాపూర్‌లో వృక్షాబంధన్‌ పేరుతో చెట్లకు రాఖీలు కట్టే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ రవి, ఎస్పీ సింధుశర్మ, ఎమ్మెల్యే సంజయ్‌, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు శుక్రవారం ప్రారంభించారు.

image:Eenadu

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం చిన్నమెట్‌పల్లి గ్రామంలో యువరైతు సందిరెడ్డి తిరుపతిరెడ్డి తాను సాగు చేసిన 4 ఎకరాల మక్కచేనులో శుక్రవారం ఉదయం మూడు రంగుల బెలూన్ల తోరణం కట్టి, జాతీయ పతకం ఆవిష్కరించి వందనం చేశార.

image:Eenadu

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా రాజస్థాన్‌ విద్యార్థులు చరిత్ర సృష్టించారు. శుక్రవారం రాష్ట్ర రాజధాని జైపుర్‌తోపాటు వివిధ ప్రాంతాల్లో కోటి మందికి పైగా విద్యార్థులు ఒకే సమయంలో దేశభక్తి గీతాలను ఆలపించి ‘వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లోకి ఎక్కారు.

image:Eenadu

 శ్రావణ శుక్రవారం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడిలోని నవదుర్గాదేవి ఆలయంలో అమ్మవారిని లక్ష గాజులతో విశేషంగా అలంకరించారు.

image:Eenadu 

 భారీ వర్షాలకు మూసారాంబాగ్‌ వద్ద మూసీ వంతెనపై రక్షణ ఫెన్సింగ్‌ కొట్టుకుపోయింది. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రక్షణ లేకపోవడం, మూసీలో ప్రవాహ వేగం అధికంగా ఉండటంతో వాహనదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

image:Eenadu


విశాలమైన మర్రి చెట్టు.. ఆ నీడలో ఆహ్లాదకరంగా బెంచీలు.. చూసేందుకు ఏ ఉద్యానమో అనుకునేరు? బడంగ్‌పేట మున్సిపాలిటీ పరిధిలోని నాదర్‌గుల్‌ గ్రామ శ్మశాన వాటిక ఇది. అంత్యక్రియల అనంతరం బంధువులు సేద తీరేందుకు ఇలా వసతులు కల్పించారు.

image:Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home