చిత్రం చెప్పే విశేషాలు! (13-08-2022/2)
భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
image:Eenadu
జగిత్యాలకు చెందిన సూక్ష్మ కళాకారుడు దయాకర్ పక్షి ఈకపై భారతదేశ పటం, జాతీయజెండాలను తీర్చిదిద్ది ఆకట్టుకున్నారు.
image:Eenadu
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై మువ్వన్నెల జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ కె.కేశవరావు తదితరులు పాల్గొన్నారు.
image:Eenadu
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఓ రేసింగ్ కారును సినీ నటి నివేదా పేతురాజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
image:Eenadu
చండీగఢ్‌లోని క్రికెట్ స్టేడియంలో గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ఆధ్వర్యంలో ప్రజలంతా జాతీయ జెండా ఆకారంలో నిల్చొని గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మానవ హారం జెండాగా రికార్డు కైవసం చేసుంది.
image:Twitter
ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో నిర్వహించనున్న పరేడ్ కోసం గోల్కొండ కోట వద్ద పోలీసు సిబ్బంది రిహార్సల్స్ నిర్వహించారు.
image:Eenadu
హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ హర్ ఘర్ తిరంగాలో భాగంగా హైదరాబాద్ రామ్‌నగర్‌లోని తన ఇంటి వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు.
image:Eenadu
భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఖమ్మం జడ్పీ సెంటర్ నుంచి 2కిలోమీటర్ల పొడవైన భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. సుమారు 10వేల మంది పాల్గొన్న ఈ కార్యక్రమానికి మంత్రి పువ్వాడ అజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
image:Eenadu