చిత్రం చెప్పే విశేషాలు!

(09-10-2022/1)

నెక్లెస్ రోడ్‌లో ప్యూర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఫన్ వాక్ అండ్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుంచి జలవిహార్ వరకు పరుగును కొనసాగించారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్‌, టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జానార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Source: Eenadu

దసరా సెలవులు ముగియడంతో గ్రామాల నుంచి నగరానికి చేరుకుంటున్న వాహనాలతో హైదరాబాద్‌-విజయవాడ 65వ నెంబర్‌ జాతీయ రహదారి రద్దీగా మారింది. దీంతో పంతంగి, నల్గొండ జిల్లా కొర్లపహాడ్‌ టోల్‌ ప్లాజాల వద్ద వాహనాలు బారులుతీరి కనిపించాయి.

Source: Eenadu

కొమురం భీమ్ వర్ధంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే సీతక్క, గిరిజన నేతలు నివాళి అర్పించారు.

Source: Eenadu

ప్రకృతి చెక్కిన చిత్రాలు ఇవి. వృక్షాలు శాఖోపశాఖలుగా విస్తరించి మోడుగా మారి వివిధ ఆకారాల్లో ఆకర్షిస్తున్నాయి. ఒక చెట్టు మోడు వినాయకుడి రూపంలో, మరో వృక్షం కొమ్మ గజరాజు తొండం ఆకృతిలో ఆకట్టుకుంటున్నాయి. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం రోడ్డులో కనిపించిన దృశ్యాలివీ.

Source: Eenadu

నిజామాబాద్‌ జిల్లా నందిపేట్‌ మండలం ఉమ్మెడలోని ప్రసిద్ధ ఉమామహేశ్వరాలయం నీటిలోనే ఉండిపోయింది. మూణ్నెళ్ల కిందట (9.7.22) వచ్చిన భారీ వరదతో నీటిలో మునిగిన ఆలయం ఇంకా బయటపడలేదు.

Source: Eenadu

ప్రతిష్ఠాత్మక సాంకేతిక విద్యా సంస్థ ఐఐటీహెచ్‌. అక్కడి ఎత్తైన భవనాలు.. చుట్టూ పొలాలు ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా కంది మండలం చిమ్నాపూర్‌ మార్గంలో వెళుతున్న ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి.

Source: Eenadu

అందమైన తీరాలను చూడటానికి విదేశాలే వెళ్లనక్కరలేదు పూడిమడక తీరాన్ని చూసినా చాలు అనే విధంగా ఇది కనిపించింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన బాలి బీచ్‌ను తలదన్నె విధంగా కనిపించిన పూడిమడక తీరం శనివారం అందరి మనసులను దోచుకునే విధంగా ఇలా కనిపించింది.

Source: Eenadu

వరుసగా వర్షాలు కురుస్తూ వాతావరణం, పరిసరాలు చిత్తడిగా తయారైన వేళ ఆకాశంలో ఏర్పడిన హరివిల్లు అందరి మనసులు దోచుకుంది. మండలంలో మేడిచర్లపాలెంలో సాయంత్రం చిరుజల్లులు పడుతూ పశ్చిమ దిక్కు నుంచి సూర్య కిరణాలు ప్రసరిస్తూ తూర్పు దిక్కున ఆకాశంలో ఇంద్రధనుస్సు ఏర్పడి అలరించింది. Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home