చిత్రం చెప్పే విశేషాలు..! (09-10-2022/2)

లండన్‌లోని ట్రఫల్గర్‌ స్క్వేర్‌లో పలువురు దీపావళి ముందస్తు వేడుకల్లో భాగంగా దాండియా, నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.

Image:Eenadu

పొన్నియిన్‌ సెల్వన్‌ 1లో శరత్‌కుమార్‌ నటన బాగుందని తలైవా రజనీకాంత్‌ అభినందించారు. విక్రమ్‌, కార్తి, ఐశ్వర్యరాయ్‌, త్రిష ప్రధాన పాత్రల్లో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పీఎస్‌-1 సెప్టెంబర్‌ 30న విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Image:Eenadu

రాంచీలో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో క్యాచ్‌ పట్టి దక్షిణాఫ్రికా క్రికెటర్‌ మార్క్రమ్‌ వికెట్‌ను తీసిన అనంతరం తొడ కొడుతూ సంబరాలు చేసుకుంటున్న కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌

Image:Eenadu

ఫిన్లాండ్‌లో నిర్వహించిన ఫిగర్‌ స్కేటింగ్‌ పోటీల్లో పలువురు క్రీడాకారులు అదరగొట్టే విన్యాసాలతో ఆకట్టుకున్నారు.

Image:Eenadu

ఇటలీలో నిర్వహించిన ‘బార్కొలనా’ సంప్రదాయ తెరచాప పడవల(సెయిలింగ్‌ బోట్‌) పోటీలో పెద్దఎత్తున ఔత్సాహికులు పాల్గొని సందడి చేశారు.

Image:Eenadu

హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో హైలైఫ్‌ బ్రైడ్స్‌ ఎగ్జిబిషన్‌ కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌ నిర్వహించారు. కార్యక్రమంలో నటీమణులు వర్షిణి, శ్రీలేఖ, మోడల్స్‌ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

Image:Eenadu

గ్రేస్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో విజయవాడలో ‘గ్లోబల్‌ గ్రేస్‌ క్యాన్సర్‌ రన్‌’ నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు, యువత, నగరవాసులు పాల్గొని ఉత్సాహంగా పరుగులు తీశారు.

Image:Eenadu

దసరా సెలవులు ముగియడంతో గ్రామాల నుంచి నగరానికి చేరుకుంటున్న వాహనాలతో హైదరాబాద్‌-విజయవాడ 65వ నెంబర్‌ జాతీయ రహదారి రద్దీగా మారింది. దీంతో పంతంగి, నల్గొండ జిల్లా కొర్లపహాడ్‌ టోల్‌ ప్లాజాల వద్ద వాహనాలు బారులుతీరి కనిపించాయి.

Image:Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home