చిత్రం చెప్పే విశేషాలు..

(10-10-2022/2)

న్యూయార్క్‌లోని జాకోబ్ కె.జావిట్స్‌ కన్వెన్షన్‌ సెంటర్లో ‘న్యూయార్క్ కామిక్‌ కాన్‌’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఔత్సాహికులు పలు కామిక్‌ పాత్రలు ధరించి సందడి చేశారు.

Source: Eenadu

పవన్‌ కల్యాణ్‌ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా కోసం పవన్‌ ఇలా కసరత్తులు చేస్తూ కనిపించారు.

Source: Eenadu

మంత్రి, సినీనటి రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఆమెకు లాంఛనంగా స్వాగతం పలికి దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.

Source: Eenadu

ప్రముఖ సినీనటులు రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌.. దర్శకుడు రాజమౌళికి సోషల్‌మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేశారు.

Source: Eenadu

ద్విచక్రవాహనంపై ఇద్దరికి మించి వెళ్లొద్దని నిబంధన ఉన్నప్పటికీ కూకట్‌పల్లిలో ఒకే వాహనంపై ఐదుగురు ప్రమాదకరంగా ప్రయాణిస్తూ కనిపించారిలా.

Source: Eenadu

విజయనగరం పైడితల్లి ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. భక్తులు ఉదయం 6 గంటల నుంచి ఆలయం వద్ద బారులుతీరి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

Source: Eenadu

ఉక్రెయిన్‌లోని కీవ్‌పై రష్యా సోమవారం వరుస క్షిపణి దాడులతో విరుచుకుపడింది. దీంతో ఓ ప్రాంతంలో భారీ గుంత ఏర్పడటంతో పాటు కార్లు ధ్వంసమై కనిపించాయి.

Source: Eenadu

టీ20 ప్రపంచకప్‌పోటీల కోసం టీమిండియా.. ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఈ సందర్భంగా పెర్త్‌లోని మైదానంలో భారత ఆటగాళ్లు ప్రాక్టీస్‌ చేస్తూ సందడి చేశారు. కేఎల్‌ రాహుల్‌ అభిమానులకు ఆటోగ్రాఫ్‌ ఇస్తూ, వారితో సెల్ఫీలు తీసుకుంటూ కనిపించారు.

Source: Eenadu

అమెరికాలోని కన్సాస్‌ నగరంలో నిండు చంద్రుడు ఇలా భారీ ఆకారంలో కనువిందు చేశాడు.

Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home