చిత్రం చెప్పే విశేషాలు!

(14-10-2022/1)

ప్రకృతి సోయగాలకు పేరుగాంచిన యారాడ సముద్రతీరం నల్లని బూడిద రంగు ఇసుకతో సందర్శకులకు ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకు కాలుష్య కారకంగా మారుతున్నా.. నివారణ చర్యలు కానరావడం లేదని పర్యాటకులు, గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

Source: Eenadu

కెన్యాలోని తుర్కానా కౌంటీలో కరవు కరాళ నృత్యం చేస్తోంది. ఎక్కడా పచ్చిక కనపడకపోవడంతో భారీ సంఖ్యలో పశువులు మరణిస్తున్నాయి. ఇందుకు సజీవ తార్కాణమే తాండొన్యాంగ్‌ గ్రామంలో తీసిన ఈ చిత్రం.

Source: Eenadu

ఉప్పల్‌ మున్సిపల్‌ మైదానంలో ఏర్పాటు చేసిన ఒపెన్‌ జిమ్‌లో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు వ్యాయామం చేస్తూ ఆహ్లాదం పొందుతున్నారు. ఇదే తరహాలో కాలనీల్లోని పార్కులు, ప్రధాన రహదారుల సమీపంలో ఏర్పాటు చేస్తే మరింత మంది వ్యాయామం చేసుకునే అవకాశం కలగనుంది.

Source: Eenadu

లివైస్‌ సంస్థకు చెందిన 1880ల నాటి జీన్స్‌ ప్యాంటు ఇది.. ఓ పాత గనిలో దొరికిన దీన్ని మెక్సికోలో వేలం వేయగా 76 వేల డాలర్లు(రూ.62.57 లక్షలు) పలికింది.

Source: Eenadu

విశాఖ నగరంలోని సాగర తీరంలో ‘ఆల్‌ఎబిలిటీ పార్కు’ వద్ద రాళ్లను నిత్యం అలలు తాకుతుంటాయి. ఆ తీవ్రతకు ప్రస్తుతం వాటి రూపురేఖలు నిపుణులు చెక్కిన రీతిగా చూడముచ్చటగా మారాయి.

Source: Eenadu

నంద్యాల జిల్లా డోన్‌ మండలంలో ఉడుములపాడు వద్ద ఉన్న జగనన్న కాలనీ ముంపునకు గురైంది. నిర్మాణాల మధ్య నిలిచిన ఆ నీటిలో గురువారం ఉదయం స్థానికులు చేపలు పట్టుకున్నారు.

Source: Eenadu

అమరావతి రైతుల పాదయాత్రలో అనుకూల, వ్యతిరేక నినాదాలతో వెలుస్తున్న ఫ్లెక్సీలు చర్చకు తావిస్తున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా వేలివెన్ను వద్ద వైకాపా ఎమ్మెల్యే ఏర్పాటు ఫ్లెక్సీ లాంటిదే మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి కొందరు ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారు.

Source: Eenadu

చండూరు ర్యాలీలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ ప్రజలకు అభివాదం చేసే సమయంలో కుడిచేతి నొప్పితో ఇబ్బంది పడ్డారు. నొప్పి ఎక్కువగా ఉండటంతో కొద్దిసేపు ఎడమ చేతితోనే ప్రజలకు అభివాదం చేశారు.

Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home