చిత్రం చెప్పే విశేషాలు..! (15-10-2022/1)
జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం చాగల్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్ టీచర్‌గా పని చేస్తున్న దేవిందర్ కౌర్ విద్యార్థుల్లో పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్నారు. జాతీయభావం పెంపొందిస్తున్నారు. పాఠశాల ఆవరణలోని వృక్షాలపై నీతి సూక్తులు రాయించారు.
#Eenadu
విశాఖ నగరంలో వర్షం పడితే చాలు... పలు ప్రాంతాల ప్రజలు గజగజలాడిపోతున్నారు. ముఖ్యంగా జాతీయ రహదారి సర్వీసు రోడ్లున్న కొన్ని చోట్ల కొన్ని గంటల పాటు వర్షం నీరు ముందుకు సాగటం లేదు. అందులోనుంచే రాకపోకలు సాగించాల్సిన దుస్థితి ఏర్పడింది.
#Eenadu
జి.మాడుగుల మండలం వంజరి పంచాయతీ బూసుపల్లి గ్రామంలోని విద్యార్థులు సమీప కృష్ణాపురంలోని పాఠశాలలో చదువుతున్నారు. మార్గమధ్యంలో వాగు దాటాల్సిఉంది. భారీ వర్షాలతో ఈ వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. శుక్రవారం విద్యార్థులను తల్లిదండ్రులు ఎత్తుకొని వాగు దాటించారు.
#Eenadu
పెద్దపల్లి మండలం గౌరెడ్డి గ్రామం పక్కనునన్న చెరువు కలువ(తామర) పూలతో నిండిపోయింది. స్థానికులు, ఈ ఊరి మీదుగా రాకపోకలు సాగించే బాటసారులను ఇవి ఆకట్టుకుంటున్నాయి. కాసేపు ఆగి మరి వీక్షిస్తున్నారు. కొందరైతే చరవాణిలో బంధిస్తున్నారు.
#Eenadu
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో తిరుమల శ్రీవారి వైభవోత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. వాహనంలోని తిరుమలేశుణ్ని భక్తులు దర్శించుకొని తరిస్తున్నారు. శుక్రవారం సోమాజీగూడకు చేరుకొన్న వాహనంలో భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. #Eenadu
కామినేని ఆసుపత్రి సమీపంలో సిరీస్ కంపెనీ రోడ్డులో ట్రాఫిక్ నియంత్రణ కోసం పాతసిగ్నల్ స్తంభం ఉండగానే.. కొత్తది ఏర్పాటు చేశారు. కానీ రెండు సిగ్నళ్ల లైట్లు వెలగడం లేదు. కనీసం ఏదో ఒక దానికి మరమ్మతులైనా చేపట్టి అందుబాటులోకి తేవాలని వాహనదారులు కోరుతున్నారు.
#Eenadu
ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుక్రవారం అస్సాంలోని గువాహటిలో శతాబ్దాల నాటి పురాతన కామాఖ్య ఆలయాన్ని సందర్శించారు.
#Eenadu
లింగంపల్లి రోడ్డులో ఓ యువకుడు డివైడర్ గ్రిల్స్‌ను ఇలా ప్రమాదకరంగా దాటుతూ కనిపించారు. చుట్టూ తిరిగి వెళ్లలేక క్షణాల్లో ఇలా వెళ్లవచ్చనే తొందరపాటు చేటు తెచ్చే ఆస్కారముంది.
#Eenadu