చిత్రం చెప్పే విశేషాలు..! (15-10-2022/2)

సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కళాశాల విద్యార్థులు ఏఈసీఐఏఎస్-2022 పేరుతో ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా విపత్తు సమయాల్లో ఫ్లైఓవర్ బ్రిడ్జి కూలిపోయిన ప్రాంతంలో క్షతగాత్రులను రక్షించే విధానంపై అవగాహన కల్పిస్తూ నాటకం వేశారు.

#Eenadu

హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఫేస్‌బుక్‌ మెటా నిర్వహించిన క్రియేటర్‌ డే ఈవెంట్‌లో ప్రముఖ సినీనటి రష్మిక మందాన, సోషలైట్స్‌ పాల్గొని సందడి చేశారు.

#Eenadu

సినీ నటి దివి పంజాగుట్టలోని ఓ నగల దుకాణంలో నూతన పండగ కలెక్షన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

#Eenadu

జనవాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు విశాఖ విమానాశ్రయంలో జనసేన కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.

#Eenadu

సాయిధరమ్‌ తేజ్‌ జన్మదినం సందర్భంగా వరుణ్‌తేజ్‌ ఆయనకు ట్విటర్‌ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తనకు సాయి ధరమ్‌తేజ్‌ కజిన్‌గా, మిత్రుడిగా దొరకడం అదృష్టమని తెలిపారు. ఈ సందర్భంగా గతంలో వారు కలిసి దిగిన ఫొటోను వరుణ్‌ పంచుకున్నారు.

#Eenadu

ముంబయిలో నిర్వహిస్తున్న లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో నటీమణులు జెనీలియా, అదితిరావు హైదరీ పాల్గొని ర్యాంప్‌ వాక్‌ చేశారు.

#Eenadu

ఎయిర్‌పోర్స్‌ వైవ్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 41,541 ఉన్ని టోపీలను ఒకేచోట ప్రదర్శించి గిన్నిస్‌ రికార్డును నెలకొల్పారు. పేదలకు వీటిని పంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ హాజరయ్యారు.

#Eenadu

అక్టోబర్‌ 16 నుంచి టీ20 వరల్డ్‌కప్‌ పోటీలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ఫొటోషూట్‌లో భారత్, పాకిస్థాన్‌ జట్ల కెప్టెన్లు రోహిత్‌ శర్మ, బాబర్‌ అజామ్‌ ఇలా మెరిశారు.

#Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home