చిత్రం చెప్పే విశేషాలు..!
(17-10-2022/1)
చిన్నారుల ఆట వస్తువులను అమ్ముకుంటూ ఉపాధి పొందే ఓ మహిళ ఆదివారం పెద్దపల్లిలో ఇలా తలపై నిండా బొమ్మలతో వెళ్తూ కనిపించారు. ప్లాస్టిక్‌తో తయారైన వివిధ ఆకృతులతో కూడిన బొమ్మలను గాలితో నింపగా, చూపరులను ఆకట్టుకున్నాయి.
Source: Eenadu
రైతులు పంటలు కాపాడుకొనేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొడంగల్ మండలం టేకుల్‌కోడ్ గ్రామానికి చెందిన రైతు కంతి చంద్రప్ప తన పత్తి పంటను జంతువుల నుంచి రక్షించుకొనేందుకు పొలంలో వర్షానికి తడవకుండా కర్రలపై గుడిసెను వేశారు.
Source: Eenadu
కోట్‌పల్లి ప్రాజెక్టు పరిసరాలు ఆదివారం పర్యాటకులతో కోలాహలంగా మారాయి. పరిసర ప్రాంతాలతోపాటు జంటనగరాలు, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు ఉల్లాసంగా గడిపారు. బోటింగ్ చేస్తూ, చిత్రాలు దిగుతూ సందడి చేశారు.
Source: Eenadu
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చండూరు పురపాలికలో ఆదివారం ప్రచారం నిర్వహించారు. ఆయనకు మహిళలు బతుకమ్మలు, బోనాలతో స్వాగతం పలికారు. కాలనీల్లో కలియ తిరిగారు. మహిళలతో కలిసి మంత్రి బోనమెత్తి ఉత్సాహపరిచారు.
Source: Eenadu
చౌటుప్పల్ మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి మల్లారెడ్డి ఆదివారం ఇంటింటికి తిరిగి తెరాస అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఆరెగూడెంలో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి సందడి చేశారు.
Source: Eenadu
మంత్రి గంగుల కమలాకర్ సంస్థాన్‌నారాయణపురంలో ఆదివారం వర్షంలోనూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓ లాండ్రీ దుకాణంలో సరదాగా ఇస్త్రీ చేశారు.
Source: Eenadu
కోహెడ మండలం గుండారెడ్డిపల్లిలోని చెరువు నీటిలో తెప్పపై ప్రయాణిస్తున్న రైతు... భానుడు అస్తమిస్తున్న సమయంలో నీటి చిరు అలలపై ఆకాశవర్ణం ప్రతిబింబంగా ప్రకృతి దృశ్యం ఆవిష్కృతమైంది.
Source: Eenadu
రాజవొమ్మంగి మండలం బడదనాంపల్లి పంచాయతీ అమ్మిరేకుల సమీపాన ఉన్న చీకుధార జలపాతం ఉరకలేస్తోంది. పర్యటకులు, స్థానికులు ఆదివారం జలపాతంలో స్నానాలు చేస్తూ సందడిగా గడిపారు.
Source: Eenadu