చిత్రం చెప్పే విశేషాలు..!

(18-10-2022/1)

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వైఎస్‌ఆర్‌ రైతు భరోసా- పీఎం కిసాన్‌ రెండో విడత పంపిణీని సోమవారం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. సంబంధిత నగదును రైతుల ఖాతాల్లో జమ చేశారు.

Source: Eenadu

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికకు సోమవారం పోలింగ్‌ జరిగింది. దిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ.

Source: Eenadu

ద్విచక్ర వాహనంపై ఇలా నాలుగో వ్యక్తిని ఫుట్‌రెస్ట్‌ పై నిలబెట్టి ప్రమాదకరంగా లారీలు వంటి భారీ వాహనాలు వెళ్లే దారిలో తీసుకెళ్లడం చూసి రహదారిపై ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. విజయవాడ పైపులరోడ్డులో కనిపించిన చిత్రమిది..

Source: Eenadu

వరంగల్‌ తహశీల్దార్‌ కార్యాలయంలో సోమవారం విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. మొబైల్‌ టార్చ్‌లైట్‌ ఆన్‌చేసుకుని పనులు చేస్తున్నారు.

Source: Eenadu

శిరస్త్రాణం ధరించాలని చోదకులకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. కానీ, వారే నియమాన్ని విస్మరిస్తున్నారు. భూపాలపల్లి పట్టణంలో విధుల నిర్వహణ సమయంలో శిరస్త్రాణం లేకుండా ఇలా పోలీసులు వెళ్తున్నారు.

Source: Eenadu

గుంటూరులో 42 కిలోమీటర్ల మేర పొగడ, పోనోకార్పస్‌ చెట్లు ఉన్నాయి. చెట్లు గుబురుగా పెరగడంతో లైటింగ్‌కు, ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రత్యేక పద్ధతిలో వీటిని కత్తిరిస్తున్నారు.

Source: Eenadu

అమలాపురంలో ఇటీవల రహదారి విస్తరణతో చాలామంది వీధి వ్యాపారులు ఉపాధి కోల్పోయారు. ఈ దర్జీ తనకు ప్రత్యామ్నాయం లేక గడియారస్తంభం నుంచి బస్టాండు వైపు వెళ్లే మార్గంలో పక్కనే ఇలా ప్రమాదపుటంచున వృత్తిని కొనసాగిస్తున్నాడు.

Source: Eenadu

విశాఖ మన్యంలో ఎక్కడ ఏ దృశ్యం చూసినా చూపరులను ఇట్టే కట్టిపడేస్తుంది. హుకుంపేట మండలం మజ్జివలస గ్రామానికి సమీపంలో రైతులు ఓ కొండపై మెట్లు కట్టినట్టు పంట పొలాలను తీర్చిదిద్ది వాటిలో వరిపైరు సాగుచేస్తున్నారు.

Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home