చిత్రం చెప్పే విశేషాలు..!

(21-10-2022/1)

ఆటోవాలాలు కూలీలను మాట్లాడుకుని పరిమితికి మించి తరలిస్తున్నారు. ఒక ఆటోవాలా తన పక్కన మరో ముగ్గురుని కూర్చోబెట్టుకుని ఫొన్‌లో మాట్లాడుతూ ప్రమాదకరంగా డ్రైవింగ్‌ చేస్తున్న ఈ దృశ్యం చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్‌ వద్ద కనిపించింది.

Source: Eenadu

ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంట కోతల అనంతరం రోడ్డుపై ఆరబోయగా.. కోతుల గుంపు ఆకలి తీర్చుకున్నాయి. ధాన్యం కుప్పల్లోని లేత గింజలను పొట్టు తీసి మరీ నింపాదిగా తిన్నాయి. భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి శివారులో గురువారం ఈ దృశ్యం కనిపించింది.

Source: Eenadu

ఈ చిత్రంలో కనిపిస్తున్న నాటుకోళ్లు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందినవి. వ్యాపారులు అక్కడి పల్లెల్లో తిరిగి వీటిని కొనుగోలు చేసి కామారెడ్డి అంగడికి తీసుకొచ్చారు. ఒక్కోటి మూడు- నాలుగు కిలోల బరువు తూగుతోంది. కిలో రూ.269 చొప్పున విక్రయిస్తున్నారు.

Source: Eenadu

ధారూర్‌ మండల పరిధిలోని బాచారం దగ్గర అసంపూర్తి రోడ్డు కారణంగా ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. కంకర పరిచి వదిలేశారు. నీళ్లు చల్లడం లేదు. దీంతో వాహనాలు రాకపోకలు సాగినప్పుడు దుమ్మరేగుతోంది.

Source: Eenadu

చెవికి పెట్టుకొనే అలంకరణ వస్తువులు కళాత్మకంగా వస్తున్నాయి. వివిధ ఆకృతుల్లో ఉండే వాటిని చాలా మంది ఇష్టపడుతున్నారు. అందుకు తగ్గట్టే వ్యాపారులు సిద్ధం చేస్తున్నారు. అనంతగిరి మండలం బొర్రా గుహల వద్ద దుకాణాల్లో ఉంచిన వీటిని యువతులు ఆసక్తిగా కొంటున్నారు.

Source: Eenadu

బంతిపూల సాగు మొదటి కోతలో పెట్టుబడులు వచ్చాయి. తరువాత దిగుబడులు పెరిగినా ధరలు ఆ స్థాయిలో లేవు. కిలో రూ.5 చొప్పున ఇతర ప్రాంతాల వ్యాపారులు తోటల వద్దే కొనుగోలు చేస్తున్నారు. దసరాకు కిలో రూ.25-40కు విక్రయించారు.

Source: Eenadu

కల్లూరు-పామిడి రహదారిలో దాదాపు రెండు నెలలుగా వరద నీటి ప్రవాహం తగ్గడం లేదు. ఎంపీఆర్‌ డ్యామ్‌ నుంచి దిగువకు వచ్చిన వరద కారణంగా ఈ ప్రవాహం కొనసాగుతోంది. దాదాపు అర కిలో మీటరు ఉన్న ఈ రహదారి చాలాచోట్ల కోతలకు గురైంది.విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి.

Source: Eenadu

జమ్మూ-కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా గుల్మార్గ్‌లో గురువారం గుర్రాలపై వెళూతూ హిమపాతాన్ని ఆస్వాదిస్తున్న పర్యాటకులు.

Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home