చిత్రం చెప్పే విశేషాలు!

(24-10-2022/1)

యూసుఫ్‌గూడలోని మొదటి పటాలం ప్రాంగణంలోని హిల్‌టాప్‌ క్వార్టర్స్‌ వద్ద చిన్నపాటి కొలను ఇటీవల వర్షాలకు పూర్తిగా నిండి ఆహ్లాదాన్ని పంచుతోంది. దీంతో బెటాలియన్‌ ప్రాంగణంలోని నివాసితులు ఉదయం, సాయంత్రం వేళలో ఇక్కడ సేదతీరుతున్నారు.

Source: Eenadu

దీపావళి పండగ సమయంలో ఆదివాసీ గోండులు నిర్వహించే దండారీ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నాగోబా సన్నిధిలో మృగాలతో చేసే పోరు నృత్యాలను నార్నూర్‌ మండలం మాన్కాపూర్‌ ఆదివాసీలు ఆదివారం వారు కళ్లకు కట్టినట్లు చూపించారు.

Source: Eenadu

ఐటీ కారిడార్‌లోని దుర్గం చెరువు పరిసరాల్లో పచ్చదనం పరిఢవిల్లుతోంది. చిట్టడవిని తలపిస్తున్న ఈ ప్రాంతం అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీ పక్కన కన్పించింది.

Source: Eenadu

మారేడ్‌పల్లి ప్రధాన రహదారి పక్కన అన్నపూర్ణ క్యాంటీన్‌ ఎదుట గత కొన్ని రోజులుగా మురుగు తిష్ఠ వేసింది. దుర్వాసన మధ్య భోజనం చేసేందుకు అన్నార్తులు ఇబ్బంది పడుతున్నారు.

Source: Eenadu

కుంబిడిసింగి పంచాయతీకి వెళ్లే మార్గమధ్యలో గెడ్డ ఉంది. ఇక్కడ వంతెన లేకపోవడంతో కుంబిడిసింగి పంచాయతీ ప్రజలు ఏకమై శ్రమదానంతో గెడ్డమధ్యలో రాళ్లను పేర్చి తాత్కాలికంగా వాహనాలు వెళ్లే విధంగా ఏర్పాటు చేసుకున్నారు.

Source: Eenadu

రాజవొమ్మంగి మండలంలోని చీకుధార ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పచ్చని చెట్ల నడుమ కొండలపై నుంచి మెట్లుమెట్లుగా జారే జలధార ఇట్టే కట్టిపడేస్తుంది. రెండు రోజుల వరుస సెలవుల నేపథ్యంలో పర్యటకులు తరలివచ్చారు.

Source: Eenadu

కారం బంతి పూల సాగుతో పాడేరు రైతులకు ఈ ఏడాది అధిక లాభాలు వస్తున్నాయి. పూల ధర అమాంతంగా పెరగడంతో రైతులకు కలిసొచ్చింది. కారం బంతి గంప రూ. 250 వరకు పలుకుతోంది. ఇక్కడి పూలను విజయవాడ, హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు రవాణా చేస్తుంటారు.

Source: Eenadu

అల్లూరి సీతారామరాజు జిల్లాలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చింతపల్లిలో ఆదివారం ఉదయం 14.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ విభాగం వెల్లడించింది.

Source: Eenadu

చెఫ్‌ డే సెలబ్రేషన్స్‌

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home