చిత్రం చెప్పే విశేషాలు!

(26-10-2022/1)

పాక్షిక సూర్యగ్రహణం దృశ్యాలను పలువురు ఆసక్తిగా తిలకించారు. పై ఫొటో: జమ్మూలోని తావి నది వద్ద ఎక్సరే ద్వారా సూర్య గ్రహణం వీక్షిస్తున్న దంపతులు. కింది ఫొటో: కర్నూలులోని జగన్నాథగట్టు వద్ద కనువిందు చేస్తున్న గ్రహణ దృశ్యం.

Source: Eenadu

దీపావళి పర్వదినాన నిర్వహించుకునే కేదారేశ్వర వ్రతాల్లో పరిశుద్ధమైన ఇసుకకు అత్యంత ప్రాధాన్యత ఉండడంతో గోదావరిఖని మార్కెట్‌లో డబ్బా(సుమారు అరకిలో) ఇసుకను రూ.10 చొప్పున విక్రయించారు.

Source: Eenadu

ఆదిలాబాద్‌కు చెందిన అభినయ్‌రెడ్డి 2015 నుంచి అమెరికాలోని చికాగోలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు. అక్కడే టేలర్‌ డయానె మర్సోలేక్‌ మిల్వాకితో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ పెద్దలను ఒప్పించి హిందూ సంప్రదాయం ప్రకారం ఈ నెల 22న హైదరాబాద్‌లో వివాహం చేసుకొని ఏకమయ్యారు.

Source: Eenadu

నిర్మల్‌లో కేబుల్‌ కనెక్షన్‌ కోసం ఇటీవల జాతీయ రహదారి పక్కన తవ్విన గుంతను సకాలంలో పూడ్చలేదు. దీంతో ద్విచక్రవాహనంపై రాత్రివేళలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి దీన్ని చూసుకోక అందులోకి ఇలా దూసుకెళ్లాడు. అదృష్టవశాత్తు ఎలాంటి గాయాలు కాలేదు.

Source: Eenadu

మోకాళ్ల కింద వరకు గడ్డంతో ఉన్న ఈ వ్యక్తి పేరు ప్రవీణ్‌ పరమేశ్వర్‌. ఈయనది కేరళ రాష్ట్రం. మలయాళ, తమిళ సినిమాల్లో నటుడిగా, అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. దాదాపు నాలుగడుగుల పొడవు ఉన్న గడ్డంతో ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు.

Source: Eenadu

అల్లూరి సీతారామరాజు జిల్లా లంబసింగిలో ఉదయం వేళల్లో పొగమంచు దట్టంగా కురుస్తోంది. చింతపల్లిలో మంగళవారం ఉదయం 14.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ విభాగం పేర్కొంది. పాడేరు ఘాట్‌ రోడ్డులో ఉదయం 9.30 గంటల వరకు మంచుతెరలు తొలగలేదు.

Source: Eenadu

ప్రజా మరుగుదొడ్లు నిరుపయోగంగా మారుతున్నాయి. సరూర్‌నగర్‌ డివిజన్‌ ఎల్బీనగర్‌ సర్కిల్‌ కార్యాలయం పక్కన ఉన్న ఈ మరుగుదొడ్డి అలంకారప్రాయంగా మారింది. దీనిని ఏర్పాటు చేశాక కొద్ది రోజులే ఉపయోగపడింది. నిర్వహణ లేకపోవడంతో రోజురోజుకు అధ్వానంగా మారుతోంది.

Source: Eenadu

విజయనగరంలోని శివాలయం వీధి శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో లక్ష రుద్రాక్షలతో రూపొందించిన శివలింగం భక్తుల్ని ఆకట్టుకుంటోంది.

Source: Eenadu

చెఫ్‌ డే సెలబ్రేషన్స్‌

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home