చిత్రం చెప్పే విశేషాలు..!
(27-10-2022/1)
హైదరాబాద్ ఇబ్రహీంబాగ్‌లోని తారామతి బారాదరిలో ఫ్యాషన్ షో నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్ పాల్గొని ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకున్నారు.
Source: Eenadu
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సదర్ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా దున్నరాజులు చేసిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి.
Source: Eenadu
నగర పౌరులకు యోగాసనాలపై అవగాహన కలిగేలా హనుమకొండ పబ్లిక్ గార్డెన్‌లో వివిధ భంగిమల్లో ఏర్పాటు చేసిన ఫైబర్ బొమ్మలివీ. కానీ, వీటి నిర్వహణ మరవడంతో చివరకు విరిగి పోయి ఇలా పొదల్లోకి చేరాయి.
Source: Eenadu
బడిలో ఇంత పెద్ద విద్యార్థిని ఎవరనుకుంటున్నారా.. ఆమె జిల్లా విద్యాధికారిణి వాసంతి. తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా బుధరావుపేట పాఠశాలలో ఉపాధ్యాయుల బోధన సామర్థ్యాన్ని, విద్యార్థుల అవగాహన సామర్థ్యాన్ని పరిశీలించేందుకు ఆమె కూడా ఇలా శ్రద్ధగా విన్నారు.
Source: Eenadu
ఇటీవల గోదావరి వరదల సమయంలో నందిగామ సమీపంలో నది ఒడ్డున టార్పాలిన్ డేరాలు ఏర్పాటు చేసుకుని చేపలు పట్టుకుంటూ జీవనం సాగించిన మత్స్యకార కుటుంబాలు వరద నీరు తగ్గడంతో తెలంగాణ రాష్ట్రం భద్రాచలం మండలం బంజర వద్ద కిన్నెరసాని వాగు వద్దకు బుధవారం ఇలా తరలివెళ్లారు.
Source: Eenadu
గుంటూరు నగరంలో రహదారులపై ఏర్పడిన గుంతలకు సకాలంలో మరమ్మతులు చేయకపోవడంతో అవి ప్రజలకు గండాలుగా మారుతున్నాయి. హనుమయ్య కంపెనీ నుంచి తురకపాలేనికి వెళ్లే రహదారే ఇందుకు నిదర్శనం.
Source: Eenadu
భారత సంతతి వ్యక్తి ఆంగ్లేయులను పాలించనుండటం సరికొత్త చరిత్ర. దీనిని అభివర్ణిస్తూ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం అనంతసాగర్‌కు చెందిన ప్రముఖ లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ రావి ఆకుపై బ్రిటన్ ప్రధానమంత్రి రిషిసునాక్ చిత్రాన్ని మలిచి శుభాకాంక్షలు తెలిపారు.
Source: Eenadu
ఏంటి ఇది బాతు అనుకుంటున్నారా.. కాదు బాతు ఆకారంలో ఉన్న బొప్పాయి పండు. అవనిగడ్డ, అశ్వారావుపాలెంకు చెందిన విశ్వనాధుని మురళీమోహన్‌రావు పెరటిలో బొప్పాయి చెట్టుకు కాచిన పండు బాతు ఆకారంలో ఉండి పలువురిని ఆకర్షించింది.
Source: Eenadu
విజయవాడలోని కృష్ణలంక స్క్యూబ్రిడ్జి సమీపంలోని ఇస్కాన్ జగన్నాథ మందిరంలో బుధవారం గోవర్థన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గోపూజ చేసి అన్నకూటను తయారుచేసి ప్రత్యేక పూజలు చేశారు. తినుబండారాలను నైవేద్యంగా సమర్పించారు.
Source: Eenadu