చిత్రం చెప్పే విశేషాలు..!

(30-10-2022/1)

రాజస్థాన్‌ రాజ్‌సమంద్‌ జిల్లాలోని నాథ్‌ద్వారాలో ఏర్పాటు చేసిన ప్రపంచంలో ఎత్తయిన(369 అడుగులు) శివుడి విగ్రహాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ శనివారం ఆవిష్కరించారు. 

Source: Eenadu  

అల్లూరి సీతారామరాజు జిల్లాలో మూడు రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పాడేరు సమీపంలోని వంజంగి మేఘాల కొండను సందర్శించేందుకు పర్యాటకులు పోటెత్తారు. మేఘాలను చీల్చుకుంటూ సూర్యోదయ సన్నివేశం తిలకించి ఆనంద డోలికల్లో తేలియాడారు.

Source: Eenadu 

చరిత్ర పరిశోధకులకు రెండు వేల సంవత్సరాల క్రితం నాటి రాతి పాత్ర లభించింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు పక్కన ఉన్న బోర్లాం గ్రామంలోని ఓ మట్టిదిబ్బపై ఈ చారిత్రక అవశేషం లభించిందని పరిశోధకులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

Source: Eenadu  

రష్యా దాడులు తీవ్రతరం చేయడంతో ఉక్రెయిన్‌లోని లివీవ్‌లో ప్రాణాలు కాపాడుకొనేందుకు రక్షణ సూట్ ధరిస్తున్న స్థానికులు.

Source: Eenadu 

భీంపూర్‌ మండలంలో తరచూ పులి సంచారం నేపథ్యంలో కదలికలను గుర్తించేలా అటవీశాఖ 30 అడుగుల వాచ్‌టవర్‌ను నిర్మించింది. కరంజి-టి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేశారు.

Source: Eenadu  

కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రంలో పక్షుల కిలకిలలు ఆకట్టుకుంటున్నాయి. వాటి కోసం ప్రత్యేకంగా బర్డ్‌ ఫెస్ట్‌ సైతం నిర్వహిస్తున్నారు. బైసన్‌కుంట, మైసమ్మకుంట, గనిశెట్టికుంట ప్రాంతాలతో పాటు అనువైన మరికొన్ని ప్రాంతాల్లో ఎంతో ముచ్చట గొలిపేలా పక్షులు కనువిందు చేస్తున్నాయి.

Source: Eenadu

కరీంనగర్‌ జిల్లా గంగాధర మండల కేంద్రంలో శనివారం జరిగిన వారసంతలో 20 కిలోలకుపైగా బరువున్న తెల్ల (నెల్లూరు జాతి) గొర్రెల్లో కొమ్ములు తిరిగిన పొట్టేలు స్థానికులు, రైతులను ఆకర్షించింది. రూ.20 వేల ధర చెల్లిస్తామన్నా విక్రయించలేదని రైతులు తెలిపారు.

Source: Eenadu

జామకాయలను సంరక్షించేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. పురుగు ఆశించకుండా, కాయ ఎదిగేందుకు ఇలా కాయలకు కవర్లను చుడుతున్నారు. కొణిజర్ల మండలం పల్లిపాడులో పాషా అనే రైతు జామతోటలో కనిపించిన దృశ్యమిది.

Source: Eenadu  

చెఫ్‌ డే సెలబ్రేషన్స్‌

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home