చిత్రం చెప్పే విశేషాలు..!
(31-10-2022/2)
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ చిత్రంలోని రామ్-భీమ్ పాత్రలకు విదేశాల్లోనూ ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. అమెరికాలోని మిస్సౌరీ రాష్ట్రం సెయింట్ లూయిస్‌లో ఇద్దరు వ్యక్తులు హాలోవీన్ వేడుకల్లో భాగంగా ఇలా రామ్-భీమ్‌ల వేషధారణలో అలరించారు.
Source: Eenadu
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని సీఆర్‌పీఎఫ్ ఆధ్వర్యంలో 5కె రన్‌ను ఏర్పాటు చేశారు. ఈ రన్‌ను నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో కిషన్‌రెడ్డి ప్రారంభించారు.
Source: Eenadu
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పార్లమెంట్ హౌస్‌లో ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులు.
Source: Eenadu
చేనేత వస్త్రాలపై విధించిన 5శాతం జీఎస్‌టీ రద్దు చేయాలంటూ తెరాస ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. ప్రదర్శనగా అబిడ్స్ జీపీవో వద్దకు వచ్చారు. బస్తాల్లో తీసుకొచ్చిన లక్షలాది పోస్టు కార్డులను కేంద్రప్రభుత్వానికి పంపించారు.
Source: Eenadu
గుజరాత్ మోర్బీ నగరంలోని మచ్చు నదిపై తీగల వంతెన ఆదివారం సాయంత్రం కూలిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 134 మంది మృతి చెందారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Source: Eenadu
హాలోవీన్ వేడుకల సందర్భంగా అమెరికాలోని ఫ్లోరిడాలో ‘అండర్ వాటర్ పంప్‌కిన్ కార్వింగ్ కాంటెస్ట్’ నిర్వహించారు. ఇందులో భాగంగా పలువురు ఔత్సాహికులు నీటి అడుగున గుమ్మడికాయలను వివిధ ఆకారాల్లో తీర్చిదిద్ది ఆకట్టుకున్నారు..
Source: Eenadu
టీ20 వరల్డ్‌కప్ పోటీల్లో భాగంగా నవంబర్2న భారత జట్టు బంగ్లాదేశ్‌తో అడిలైడ్‌లో తలపడనుంది. ఈ సందర్భంగా టీమిండియా అడిలైడ్ చేరుకున్న ఫొటోను విరాట్ కోహ్లీ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
Source: Eenadu
నల్గొండ జిల్లా నాంపల్లి మండలం వేదపల్లి గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తరఫున ములుగు ఎమ్మెల్యే సీతక్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూరగాయలు అమ్ముతున్న ఒక యువకుడి త్రాసులో కూరగాయలను తూకం వేసి కార్యకర్తల్లో జోష్ పెంచారు.
Source: Eenadu
రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వీడియోలోనిది ఈ చిత్రం. ఇందులో రష్యా యుద్ధనౌక ఉక్రెయిన్ లక్ష్యంగా క్షిపణిని ప్రయోగిస్తూ కనిపించింది. సోమవారం రష్యా.. కీవ్, ఖర్కీవ్ నగరాలపై దాడులను ఉద్ధృతం చేసింది.
Source: Eenadu