చిత్రం చెప్పే విశేషాలు!
(02-11-2022/1)
‘అమరావతి సత్యం.. మూడు రాజధానులు ఒక భ్రమ’ అనే పోస్టర్లు విశాఖ నగరంలో మంగళవారం రాత్రి పలుచోట్ల దర్శనమిచ్చాయి. అమరావతికి మద్దతుగా ఉత్తరాంధ్రలో పెద్ద సంఖ్యలో పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తామని ఇటీవల ‘జన జాగరణ సమితి’ నిర్వాహకులు వెల్లడించారు.
Source:Eenadu
భారతదేశ ఔన్నత్యాన్ని, సంస్కృతీ, సంప్రదాయాలను కళ్లారా చూసేందుకు ప్యారిస్‌కు చెందిన దంపతులు ఎరిక్(60), మేరీ(50) సైకిల్ యాత్ర సాగిస్తున్నారు. ఈఫిల్ టవర్ ప్రాంతంలో ఉండే వీరు ఇప్పటికే ఏడు నెలలుగా 15 వేల కి.మీ.లు సైకిళ్లపై ప్రయాణించారు.
Source:Eenadu
నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం అర్ధరాత్రి 1 గంటకు విద్యుత్తు స్తంభం విరిగిపోవడంతో కరెంటు సరఫరా నిలిచిపోయి దాదాపు 200 మంది రోగులు, వారి సహాయకులు అవస్థలు పడ్డారు.
Source:Eenadu
శ్రీసత్యసాయి జిల్లా రొళ్ల మండలం జీరిగేపల్లి శ్రీఅమ్మాజీ ఆలయ ఆవరణలోని 108 కిలోల బరువు గల గంటను ఎలుగుబంటి మోగించింది. సోమవారం రాత్రి రెండు ఎలుగుబంట్లు ఆలయంలోకి ప్రవేశించి మొత్తం కలియ తిరిగాయి.
Source:Eenadu
దిల్లీ నరేలా పారిశ్రామిక ప్రాంతంలోని ప్లాస్టిక్ కర్మాగారంలో మంగళవారం మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.
Source:Eenadu
కాలిబాటపై కూర్చుని యాచించే ఈ దివ్యాంగురాలు అలసిపోయి అక్కడే తన కృత్రిమ కాలును దిండుగా చేసుకుని సేద తీరుతుండగా బేగంపేటలో తీసిన చిత్రమిది. ఈ వృద్ధురాలి పేరు రోషన్‌బీ. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ప్రాంతానికి చెందిన ఈమె వయసు 70.
Source:Eenadu
మునుగోడు ఉప ఎన్నికలో ప్రచారం చివరి రోజు కేటీఆర్ రోడ్ షో సందర్భంగా కనిపించిన చిత్రమిది. వాహనాల మధ్య నుంచి గజరాజు నడిచి వస్తున్నట్లుంది. నిజానికి బీఎస్పీ అభ్యర్థి ప్రచారానికి తమ ఎన్నికల గుర్తు అయిన ఏనుగు బొమ్మను ఇలా వాహనంపై నిలబెట్టి ప్రచారం నిర్వహించారు.
Source:Eenadu
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పెంచలకోన పుణ్యక్షేత్రం పరిసరాలన్నీ ఆహ్లాదకరంగా మారాయి. కొండల్లో నుంచి వస్తున్న జలపాతం కనువిందు చేస్తోంది. ప్రకృతి రమణీయతకు అద్దం పట్టడంతో ఎక్కువ మంది భక్తులు తమ చరవాణుల్లో చిత్రాలు తీసుకున్నారు.
Source:Eenadu