చిత్రం చెప్పే విశేషాలు!
(06-11-2022/1)
తెలంగాణ రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నాలుగు రోజులుగా దట్టమైన పొగమంచు కురుస్తోంది. పల్లెల్లో ఇంటి వద్దే మంటలు వేసుకుంటూ చలి నుంచి రక్షణ పొందుతున్నారు.
Source: Eenadu
అరుదైన ఆకుపచ్చ రంగు పావురాలు (గ్రీన్ ఇంపీరియల్ పిజియన్) ఇవి. అమ్రాబాద్ పులుల అభయారణ్యంలోని ఫర్హాబాద్ అటవీ ప్రాంతంలో ఇటీవల కనిపించగా.. సిబ్బంది ఫొటోలు తీశారు. ఇవి జనసంచారం ఉండే ప్రాంతాల్లో తిరగవని జిల్లా అటవీ అధికారి రోహిత్ గోపిడి తెలిపారు.
Source: Eenadu
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా తాడోబా అభయారణ్యం పరిధిలో తరచూ పులుల దాడుల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో పులి దాడుల నుంచి రక్షణకు అటవీశాఖ అధికారులు ప్రత్యేకంగా తయారు చేసిన ఈ ప్లాస్టిక్ మాస్కులు అందిస్తున్నారు.
Source: Eenadu
నారాయణపేట జిల్లా కేంద్రంలోని పురాతన బారంబావి (మెట్ల బావి) ప్రస్తుతం ఓపెన్ అక్వేరియాన్ని తలపిస్తోంది. 365 రోజులూ ఊట నీటితో కళకళలాడే ఈ బావిలో చేప పిల్లలను వదిలారు. సెలవు దినాల్లో ఈ బావిని చూసేందుకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.
Source: Eenadu
పల్లెలపై మంచు దుప్పటి పరుచుకుంది. శనివారం తెల్లవారిన తర్వాత కూడా మంచు కమ్మేయడంతో సూర్యుడు మసక బారిపోయాడు. వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వచ్చింది. వరంగల్ జిల్లా నల్లబెల్లి-మల్లంపల్లి ప్రధాన రోడ్డు వెంట కనిపించిన దృశ్యం.
Source: Eenadu
మాదాపూర్ హైటెక్స్‌లో శనివారం నిర్వహించిన హిప్ హాప్ వేడుకలో సినీ నటుడు విజయ్ దేవరకొండ పాల్గొని యువతను ఉత్సాహపరిచారు. ముంబయి, దిల్లీ నుంచి వచ్చిన కళాకారులు నృత్యాలు, పాటలతో హోరెత్తించారు.
Source: Eenadu
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు లేపాక్షి చిన్న చెరువు నిండి నీరు రహదారిపై మరువ పారడంతో లేపాక్షి- కంచిసముద్రం వెళ్లే మార్గం కోతకు గురై ప్రమాదకరంగా మారింది. ఎటువంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ఏ సమయంలో ఎటువంటి ప్రమాదం సంభవిస్తుందోనని వాహనదారులు భయపడుతున్నారు.
Source: Eenadu
విశాఖ బీచ్‌రోడ్డు నోవాటెల్ హోటల్లో శనివారం సాయంత్రం జేడీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. దిల్లీ, ముంబయి, బెంగళూరు నుంచి వచ్చిన మోడల్స్ ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేస్తూ ఆకట్టుకున్నారు.
Source: Eenadu