చిత్రం చెప్పే విశేషాలు..!
(07-11-2022/2)
మంగళవారం కార్తిక పౌర్ణమి నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌లోని సంగమానికి భక్తులు పోటెత్తారు. పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చిన భక్తులు, పర్యాటకులు అక్కడే పడవ ప్రయాణం చేస్తూ సందడిగా గడిపారు.
Source: Eenadu
హైదరాబాద్ శివారు హయత్‌నగర్‌లోని బచ్‌పన్ ప్లే స్కూల్‌లో వెజిటబుల్ వెండర్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు కూరగాయలు విక్రయించే వ్యాపారులుగా నటిస్తూ సందడి చేశారు.
Source: Eenadu
నటి అనుష్క పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. అనుష్క, నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనుష్క మాస్టర్ చెఫ్ ‘అన్విత రవళి శెట్టి’గా కనిపించనుంది.
Source: Eenadu
దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము పలు రాష్ట్రాలకు చెందిన నర్సులకు నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను అందజేశారు. కొవిడ్ కష్టకాలంలో బాధితులకు నర్సులు ఎనలేని సేవలందించారని రాష్ట్రపతి కొనియాడారు.
Source: Eenadu
కార్తిక సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. భక్తిగా ప్రమిదలు వెలిగించి.. క్షీరాభిషేకాలు నిర్వహించారు. హైదరాబాద్ జగద్గిరిగుట్టలోని ఓ ఆలయంలో కనిపించిన దృశ్యమిది.
Source: Eenadu
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్‌ఎఫ్ నాయకులు కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. విద్యార్థులు భారీగా తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Source: Eenadu
నెల్లూరు కలెక్టరేట్ ఎదుట గిరిజన ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని నినాదాలు చేశారు.
Source: Eenadu
ఈజిప్ట్‌లోని షర్మ్ అల్ షేక్‌లో ‘కాప్ 27 యు.ఎన్. క్లైమేట్ సమ్మిట్’ నిర్వహించారు. అక్కడ భారీ భూగోళం నమూనాను ఏర్పాటు చేయగా.. సదస్సుకు హాజరైన ఓ మహిళ ఇలా ఫొటో తీయించుకొని మురిసిపోయారు.
Source: Eenadu