చిత్రం చెప్పే విశేషాలు..!

(08-11-2022/1)

అన్నవరం సత్యదేవుని గిరి ప్రదక్షిణకు భక్తులు పోటెత్తారు. కొండ దిగువున తొలిపావంచాల నుంచి ప్రదక్షిణ ప్రారంభం కాగా.. వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు.

Source: Eenadu

ధర్మవరంపై సోమవారం మంచు దుప్పటి పరుచుకుంది. రైల్వేస్టేషన్‌ నుంచి బెంగళూరు వైపు వెళుతున్న రైలు మంచుపొగల మధ్య దూసుకువెళ్లడం చూపరులను కనువిందు చేసింది.

Source: Eenadu

గుంటూరు జిల్లా మంగళగిరి 6వ బెటాయలిన్‌ గ్రౌండులో ఉన్న డాంగ్‌ ట్రైనింగ్‌ సెంటర్లో ఉన్న ఓ మర్రి చెట్టు కాండం మధ్యలో ఏకదంతంతో ఉన్న వినాయకుడి రూపు దర్శనమిస్తోంది. వినాయకుడి రూపు చూసి అక్కడి పోలీసు సిబ్బంది దండం పెట్టుకుని వెళుతున్నారు..

Source: Eenadu

దేవ్‌ దివాళీ సందర్భంగా సోమవారం రాత్రి ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో దీపాల వెలుగుల్లో దేదీప్యమానంగా మెరిసిపోతున్న గంగా ఘాట్లు.

Source: Eenadu

నానక్‌రాంగూడ కూడలిలో హెచ్‌ఎండీఏ, హెచ్‌జిసీఎల్‌ కార్యాలయం సమీపంలో.. ప్రశాంతంగా ఉన్న మనిషిని సూచించేలా వృథా ఇనుప సామగ్రితో 12 అడుగుల ఎత్తున ఏర్పాటుచేసిన కళాకృతి వద్ద ఉదయిస్తున్న సూర్యుడు ఇలా కనువిందు చేశాడు.

Source: Eenadu

కర్నూలు కొండల నడుమ కొలువైన యాగంటి క్షేత్రం కార్తిక పౌర్ణమి వెలుగుతో విరాజిల్లుతోంది. సోమవారం ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మొక్కులు చెల్లించారు.

Source: Eenadu

రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్‌.అంబేడ్కర్‌ భారీ విగ్రహం ఏర్పాటులో మరో దశకు అడుగుపడింది. నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం నెక్లెస్‌ రోడ్డులో ఐమాక్స్‌ పక్కన ప్రస్తుతం దిమ్మెపై పాదాల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి.

Source: Eenadu

డుంబ్రిగుడ మన్యంలో ఉదయం తొమ్మిది గంటలవరకు మంచు వీడటం లేదు. చలిమంటలతో గిరిజనులు ఉపశమనం పొందుతున్నారు. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు తెల్లవారుజామున మంచులో పరుగులు పెడుతూ వ్యాయామం చేస్తున్నారు. 

Source: Eenadu

చెఫ్‌ డే సెలబ్రేషన్స్‌

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home