చిత్రం చెప్పే విశేషాలు!

(25-07-22)

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 107వ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన పలు కీలక సన్నివేశాలను కర్నూలు కొండారెడ్డి బురుజు ప్రాంతంలో చిత్రీకరించారు. చిత్రీకరణలో బాలకృష్ణతో పాటు నటి శ్రుతిహాసన్‌ తదితర నటులు పాల్గొన్నారు.

Source: Eenadu

నూతన రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలులో సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఆమెతో ప్రమాణం చేయించారు. ప్రథమ పౌరురాలిగా బాధ్యతలు స్వీకరించిన ఆమెకు ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు ఇలా నమస్కరిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. Source: Eenadu

కాలిఫోర్నియాలోని మారిపోస కౌంటీలో భారీ కార్చిచ్చు రేగింది. దీంతో అగ్నిమాపకశాఖ సిబ్బంది విమానం సహాయంతో మంటలను ఆర్పే ద్రావణం ఇలా చల్లారు.

Source: Eenadu

ప్రపంచ క్షేమం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాద నీరాజనం వేదికపై పదో విడత బాలకాండ పారాయణం చేశారు. 45 నుంచి 49 సర్గల వరకు 133 శ్లోకాలతో ఈ పారాయణం సాగింది. వేద పండితులు అఖండ పారాయణం చేయగా.. భక్తిభావంతో పలువురు భక్తులు వారిని అనుసరించారు.

Source: Eenadu

ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా సోమవారం పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఇదో చరిత్రాత్మక దినం అని పేర్కొంటూ ప్రముఖ కళాకారుడు సుదర్శన్‌ పట్నాయక్‌ ఒడిశాలోని పూరీ తీరంలో సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు.

Source: Eenadu

ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్‌ రీజియన్‌లో రష్యన్‌ సైనికులను ఉద్దేశిస్తూ సోల్జర్స్‌ బొమ్మలను వేలాడదీశారు.

Source: Eenadu

వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పీసీసీ మాజీ చీఫ్‌, మాజీ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ను కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్‌తో ఉన్న అనుభవాలను డీఎస్‌ గుర్తు చేసుకున్నారు.

Source: Eenadu

మెగాస్టార్‌ చిరంజీవి ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతో కేకు కోయించారు. కైకాలకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు చిరంజీవి తెలిపారు.

Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

వదిలేయాల్సింది మీ కలలను కాదు

Eenadu.net Home