చిత్రం చెప్పే విశేషాలు! (14-08-2022/2)

టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ఆకుల శ్రీజ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటి హరిత స్ఫూర్తి చాటారు. ఇటీవల జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ, సీనియర్‌ ఆటగాడు శరత్‌ కమల్‌తో కలిసి టేబుల్‌ టెన్నిస్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో స్వర్ణం గెలిచారు.

image:Eenadu

పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలకు మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. కాలికి గాయం అయిన తరువాత ఆయన తొలిసారిగా ఈ కార్యక్రమానికి హాజరు కావడం విశేషం.

image:Eenadu

ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆదివారం ఆలేరు నియోజకవర్గం గుండాల మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పల్లెజనం ఆయనకు కోలాటాలతో స్వాగతం పలికారు.

image:Eenadu

స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల స్ఫూర్తి ఊరూరా వెల్లివిరుస్తోంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఓ రైతు తన ఎద్దుల కాడికి జెండా కట్టుకొని భార్యతో కలిసి పొలంలో విత్తనాలు నాటే పనిలో నిమగ్నమయ్యాడు.

image:Eenadu 

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా మంబయి నగరంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. అందులో పాల్గొన్న ఓ చిన్నారిని చూసి ముచ్చటపడి ఓ ఎన్‌ఎస్‌జీ కమాండో అతడితో సెల్ఫీ తీసుకుంటున్న దృశ్యమిది.

image:Twitter

తన మనమరాలు రుద్రి ‘హర్‌ ఘర్‌ తిరంగా’లో భాగంగా ఇంటిపై జెండా ఎగురవేసిన ఫొటోను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు.

image:Twitter

హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో తెదేపా అధినేత చంద్రబాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం భద్రతా సిబ్బందికి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ శుభాకాంక్షలు తెలిపారు.

image:Twitter

హైదరాబాద్ అంటే తనకు ఎంతో ఇష్టమని మిస్ ఇండియా 2022 విజేత సినీశెట్టి అన్నారు. ఇనార్బిట్‌మాల్‌లోని ఓ షోరూమ్‌లో నూతన మోడల్‌ పాదరక్షలను ఆమె ప్రారంభించారు. సినీ శెట్టితో పాటు మిస్‌ ఇండియా మొదటి, రెండో రన్నరప్‌ రూబల్ షెకావత్, షినాతా చౌహాన్‌లు పాల్గొన్నారు.

image:Eenadu

నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ తాజా చిత్రం ‘బింబిసార‌’ ఈ ఆగ‌స్టు 5న విడుద‌లైంది. తాజాగా నందమూరి బాల‌కృష్ణ ఈ సినిమాను వీక్షించి చాలా బాగుందని.. కల్యాణ్ రామ్‌కు, దర్శకుడు వ‌శిష్ఠ,చిత్రబృందానికి బాలయ్య అభినందనలు తెలిపారు.

image:Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home