చిత్రం చెప్పే విశేషాలు..!

(10-11-2022/1)

విద్యార్థులకు వాల్టా చట్టంపై అవగాహన కల్పించాల్సిన చదువుల తల్లి నిలయంలోనే ఆ చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. ప్రధాన మంత్రి విశాఖ రానున్న నేపథ్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని సభా ప్రాంగణంలో ఉన్న పచ్చని చెట్లను పొక్లెయిన్ల సహాయంతో పెకిలిస్తున్నారు. 

Source: Eenadu

నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రం మీదుగా వెళ్తున్న జాతీయ రహదారి 167 ఇది. నిర్మించి వంద రోజులు కూడా గడిచిందో లేదో నాణ్యతా ప్రమాణాలు లోపించడంతో తారు కోతకు గురవుతోంది.

Source: Eenadu

మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి సర్పంచి దర్శనాల సుస్మిత అప్పులు చేసి మరీ సుమారు రూ.20 లక్షల విలువైన అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రభుత్వం నుంచి గత రెండేళ్లుగా వాటికి సంబంధించిన బిల్లులు రాకపోవడంతో చేసేదేమీలేక గత వారం రోజులుగా వ్యవసాయ కూలీ పనులకు వెళ్తున్నారు.

Source: Eenadu

పెద్దకడబూరు మండలంలో పల్లెలన్నీ వలసబాట పట్టాయి. చిన్నతుంభళం, కల్లుకుంట నుంచి రెండు వాహనాల్లో తెలంగాణలోని రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు వెళ్లారు. మండలంలో ఇప్పటి వరకు ఐదు వేల మందికిపైగా కూలీలు బతుకుదెరువుకు ఇతర ప్రాంతాలకు వెళ్లారు. 

Source: Eenadu

ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో ప్రధాని మోదీ సభా వేదికకు 600 మీటర్ల దూరంలోని కెమికల్‌ ఇంజినీరింగ్‌ బ్లాకు వద్ద తురాయి చెట్టుకు రెండు తేనెపట్లు ఉన్నట్లు బుధవారం జీవీఎంసీ అధికారులు గుర్తించి.. ప్రత్యేక సిబ్బందితో కిందకు దించారు. 

Source: Eenadu

ప్రధాని పర్యటన నేపథ్యంలో పారిశ్రామిక ప్రాంతం నేవల్‌ యూనిట్ల పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. భద్రతతో పాటు పరిశుభ్రతకు పెద్దపీట వేసేలా పరిసరాలను శుభ్రం చేయిస్తున్నారు. Source: Eenadu

ఇజ్రాయెల్‌లోని టెల్‌ లాహీష్‌లో వెలుగుచూసిన ఈ దంతపు దువ్వెన 3,700 సంవత్సరాల క్రితానిది. పేలు బాధ నుంచి విముక్తి కోసం ఉపయోగించాలంటూ దీనిపై కేననైట్‌ భాషలో వాక్యం ఉందని ఇజ్రాయెల్‌ అధికారులు తెలిపారు.

Source: Eenadu 

రూ.లక్షలు ధార పోశారు. వాహన చోదకులకు అవగాహన కల్పించేందుకు పలు కూడళ్ల వద్ద డిజిటల్‌ వాయిస్‌ డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేశారు. తరువాత వాటి నిర్వహణ మరచిపోవడంతో అలంకారప్రాయంగా మిగిలిపోయాయి. నిజాం కళాశాల వద్ద కనిపించిన దృశ్యం.

Source: Eenadu

చెఫ్‌ డే సెలబ్రేషన్స్‌

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home