చిత్రం చెప్పే విశేషాలు!

(10-11-2022/2)

మునుగోడు ఉప ఎన్నికలో గెలిచిన తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. శాసనసభలోని స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ఛాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Source: Eenadu

హైదరాబాద్‌ చందానగర్‌లోని ఓ నగల దుకాణం ప్రారంభోత్సవానికి యువ కథానాయిక మెహరీన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

Source: Eenadu

అడిలైడ్‌ వేదికగా భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య జరుగిన టీ20 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌కు మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ హాజరయ్యారు. అభిమానులతో కలిసి ఫొటోలు దిగుతూ సందడి చేశారు.

Source: Eenadu

టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ ఫ్యాన్స్‌ 30 అడుగుల పొడవైన ఆయన కళాఖండాన్ని తీర్చిదిద్దారు. ఇందులో రాకెట్‌ను నడుపుతున్న మేక శరీరానికి ఆయన తలను జోడించారు. దీనికి సుమారు రూ.6లక్షల డాలర్లు ఖర్చు కావడం గమనార్హం.

Source: Eenadu

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌లో కాసాని జ్ఞానేశ్వర్‌ తెతెదేపా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమానికి తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హాజరై ఆయన్ను అభినందించారు.

Source: Eenadu

చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు మోడౌ ఫాల్‌. ప్లాస్టిక్‌ మ్యాన్‌గా పేరుగాంచిన ఆయన సెనెగల్‌లోని యారాఖ్‌ బీచ్‌లో శరీరమంతా ప్లాస్టిక్‌ కవర్లు, సంచులు కట్టుకొని కనిపించాడు. ‘ప్లాస్టిక్‌ సంచుల్ని వినియోగించొద్దు’ అని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు.

Source: Eenadu

ప్రముఖ సినీనటుడు అలీ దంపతులు మెగాస్టార్‌ చిరంజీవిని కలిశారు. తమ కుమార్తె ఫాతిమా వివాహానికి రావాలని కోరుతూ ఆహ్వానపత్రికను ఆయనకు అందజేశారు.

Source: Eenadu

ప్రముఖ సినీనటుడు నాని గురువారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం ఇచ్చారు. 

Source: Eenadu

చెఫ్‌ డే సెలబ్రేషన్స్‌

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home