చిత్రం చెప్పే విశేషాలు!
(11-11-2022/1)
రూ.450 కోట్లతో అత్యాధునికంగా అభివృద్ధి చేయనున్న విశాఖపట్నం రైల్వేస్టేషన్ నమూనాలు ఇవి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిర్మాణ పనులకు శనివారం శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ప్రధాని కార్యాలయం గురువారం ఈ చిత్రాలను విడుదల చేసింది.
source:Eenadu
రామగుండం ఎరువుల పరిశ్రమ (ఆర్‌ఎఫ్‌సీఎల్)లో అమ్మోనియా, నైట్రోజన్, నీటి మిక్సింగ్ ప్రక్రియలో అవాంతరాలు తలెత్తడం, యంత్రాలు మొరాయించడంతో పెద్ద ఎత్తున యూరియా వినియోగానికి పనికిరాకుండా పోతోంది. పాత కర్మాగారం యూరియా ఫిల్లింగ్ టవర్ల వద్ద 5 ఎకరాల్లో గుట్టలుగా పడేశారు.
source:Eenadu
నల్గొండలో ప్రారంభమైన హజ్రత్ సయ్యద్ షా లతీఫుల్లా ఖాద్రి ఉర్సు ఉత్సవాల సందర్భంగా గంధం ఊరేగింపులో పేల్చిన టపాసులు దిశ మారిపోయాయి. నిప్పురవ్వలు చిమ్మడంతో భక్తులు, పోలీసులు ఇబ్బందులు పడ్డారు.
source:Eenadu
సంస్థాన్ నారాయణపురంలో కనిపించిన చిత్రమిది. పంట చేనులో కరెంటు స్తంభం పై భాగం విరగ్గా దానికి ఉన్న ఇనుప కడ్డీకి ఆసరాగా కరెంటు తీగలు వేలాడుతున్నాయి. ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరని పలువురు ప్రశ్నిస్తున్నారు.
source:Eenadu
రాజధానిలో సీడ్ యాక్సిస్‌కు అనుసంధానంగా నిర్మించిన రహదారులు గందరగోళంగా తయారయ్యాయి. ప్రభుత్వం మారాక రాజధాని నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో మందుబాబులకు అడ్డాగా మారుతున్నాయి. విట్, ఎస్‌ఆర్‌ఎం కళాశాలలకు వెళ్లే మార్గాల్లో ఎక్కువగా ఈ పరిస్థితి నెలకొంది.
source:Eenadu
అనంతపురం జిల్లా శెట్టూరు మండలం బసంపల్లి ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతులకుగానూ ఐదుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. అందులోనూ గైర్హాజరవుతున్నారు. చేసేదేమీ లేక ఉపాధ్యాయురాలు ఉమ హాజరైన వారికి పాఠాలు చెబుతున్నారు.
source:Eenadu
ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కలిగిరి మండలం చిన్న అన్నలూరులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆయన సొంత వాహనం కాస్త వెనుక ఉండటంతో.. అందుబాటులో ఉన్న పోలీసు జీపు ఎక్కి ఇలా ప్రయాణించారు.
source:Eenadu
అల్ప పీడన ప్రభావంతో గురువారం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ జలమయంగా మారాయి. రహదారులపై ఏర్పడిన గోతుల్లో వర్షపు నీరు నిలిచి.. వాటిని గుర్తించలేక వాహనదారులు అవస్థలు పడ్డారు.
source:Eenadu