చిత్రం చెప్పే విశేషాలు!

(12-11-2022/1)

విశాఖలో రూ.10,742 కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

source:Eenadu

మంత్రి సత్యవతి రాథోడ్‌ భద్రాద్రి సీతారాములను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేశారు.

source:Eenadu

గుంటూరు జిల్లా తెనాలిలో ఫైబర్ గ్లాస్‌తో 13 అడుగుల ప్రధాని నరేంద్ర మోదీ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. తెనాలి శూర్య శిల్పశాలకు చెందిన కళాకారులు తయారు చేశారు. విగ్రహాన్ని తెనాలి శాసనసభ్యుడు అన్నాబత్తుని శివకుమార్‌ సందర్శించారు. source:Eenadu

భద్రాచలంలోని రామాలయ ఆవరణలో శనివారం బాలోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు, కళాకారులు నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.

source:Eenadu

విశాఖలోని ఆర్కే బీచ్‌కు శుక్రవారం సాయంత్రం పర్యాటకులు పెద్దఎత్తున తరలివచ్చి సందడి చేశారు. కడలి తీరాన ఆటలాడుతూ, సెల్ఫీలు తీసుకుంటూ మైమరచిపోయారు.

source:Eenadu

సాధారణంగా మోడువారిన చెట్లపై పక్షులేవీ వాలవు. అయితే ఇక్కడ రామచిలుకలు ఓ మోడైన తాటి చెట్టుకు నిలువెల్లా రంధ్రాలు చేసి గూళ్లుగా మార్చుకున్నాయి. చూడ ముచ్చటైన ఈ చిత్రం హైదరాబాద్‌ నగర శివారులోని పెద్ద అంబర్‌పేట వద్ద కనిపించింది.

source:Eenadu

ప్రకృతి రమణీయ ప్రదేశం పాపికొండల్లో పర్యాటకులు సందడి చేశారు. వరరామచంద్రాపురం మండలంలోని పోచవరం లాంచీల రేవు నుంచి శుక్రవారం 93మందితో రెండు లాంచీలు పాపికొండల యాత్రకు వెళ్లాయి.

source:Eenadu

స్వచ్ఛ హైదరాబాద్‌ అంటూ బల్దియా నగరంలో ఎక్కడికక్కడ లక్షల రూపాయలు వెచ్చించి మరుగుదొడ్లు ఏర్పాటు చేసింది. నిర్వహణ లేక చాలా చోట్ల మూలకు చేరడంతో స్వచ్ఛ లక్ష్యం నెరవేరడం లేదు. రాంనగర్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన ప్రజా మరుగుదొడ్డి పరిస్థితి ఇది.

source:Eenadu

మీ జీవితపు స్టీరింగును వేరొకరికి ఇవ్వొద్దు

చెఫ్‌ డే సెలబ్రేషన్స్‌

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home