చిత్రం చెప్పే విశేషాలు
(13-11-2022/2)
ముంబయిలో ‘80s యాక్టర్స్ రీ యూనియన్’ నిర్వహించారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, నరేశ్, శరత్‌కుమార్, అనుపమ్‌ఖేర్, భానుచందర్, రమ్యకృష్ణ, సుహాసిని, రాధ తదితరులు పాల్గొన్నారు.
Source: Eenadu
కార్తిక మాసం.. పైగా ఆదివారం కావడంతో విశాఖలోని జంతు ప్రదర్శనశాలకు సందర్శకులు భారీగా తరలివచ్చారు. చిన్నారులకు జంతువులను చూపిస్తూ వారి తల్లిదండ్రులు ఫొటోలు తీసుకున్నారు. వివిధ కళాశాలల విద్యార్థులు ఒక్కచోట చేరి నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు.
Source: Eenadu
శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కార్తికమాసం.. పైగా ఆదివారం కావడంతో పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో గుట్ట పరిసరాలు కిటకిటలాడాయి. వాహనాలు బారులుతీరాయి.
Source: Eenadu
ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ గుజరాత్ కేవడియాలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించారు. అక్కడి ఆహ్లాదకర వాతావరణం తనను ఆకట్టుకుందని తెలుపుతూ ట్విటర్‌లో పోస్టు పెట్టారు.
Source: Eenadu
గుంకలాంకు రోడ్‌షోగా వెళ్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు ఇలా బస్సులు, లారీలు, కార్లు ఎక్కి కనిపించారు.
Source: Eenadu
మహారాష్ట్రలో సాగుతున్న భారత్‌జోడో యాత్రలో ఓ వ్యక్తి ఇలా అరటి ఆకుపై రాహుల్ గాంధీ, భారతదేశ చిత్రాలను తీర్చిదిద్ది ఆకట్టుకున్నాడు.
Source: Eenadu
నెల్లూరు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. గూడూరు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Source: Eenadu
లెబనాన్‌లోని బైరట్‌లో 21కిలోమీటర్ల ఇంటర్నేషనల్ మారథాన్ నిర్వహించారు. కార్యక్రమంలో వేలమంది పాల్గొని సందడిగా వీల్‌ఛైర్ రేసింగ్ చేశారు.
Source: Eenadu