చిత్రం చెప్పే విశేషాలు..!

(15-11-2022/1)

విశాఖలో తితిదే ఆధ్వర్యంలో దీపోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొని దీపాలు వెలిగించి భక్తి ప్రపత్తులను చాటారు.

Source: Eenadu

హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో ఆశ్రయ్‌ ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆడిపాడి సందడి చేశారు.

Source: Eenadu

శ్రీకాకుళంలోని సీతంపేటలో పర్యాటకుల సందడి అంబరాన్నంటింది. కార్తిక మాసం కావడంతో వన భోజనాలకు తరలివచ్చారు. ఎన్టీఆర్‌ సాహస ఉద్యానం, మెట్టుగూడ, సున్నపుగెడ్డ, మల్లి జలపాతాల వద్ద ఆహ్లాదకర వాతావరణం కనిపించింది.

Source: Eenadu

కర్ణాటకలోని ఉడుపి కాపు సముద్ర తీరంలో ‘కాంతార’ సైకత చిత్రమిదీ. రిషబ్‌ శెట్టి నటించిన ఈ చిత్ర ప్రదర్శన 50 రోజులు పూర్తయిన సందర్భంగా మణిపాల్‌ ఇసుక కళాకారులు ఈ భూతారాధన చిత్రం తీర్చిదిద్దారు.

Source: Eenadu

చిత్తూరు నగరంలోని ఎంఎస్‌ఆర్‌ కూడలి నుంచి పాత బస్టాండు వైపుగా ఓ వ్యక్తి సైకిల్‌పై పూల సంచులు వేసుకొని.. తన తలపై మరో సంచిని పెట్టుకొని ముందుకు సాగుతూ కనిపించాడు. ఏ మాత్రం అదుపు తప్పినా తలపై భారం తలనొప్పిగా మారే ప్రమాదం ఉంది.

Source: Eenadu

ఈ చిత్రంలో చూశారా..? చెట్టుపై మరో చెట్టు ఉన్నట్లుంది కదూ. కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలం ఖరగ్‌ శివారులో పత్తి చేనులో ఉన్న బబ్బిలి చెట్టు ఇది. గతంలో చెట్టు కొట్టేయడంతో మళ్లీ ఇలా పెరిగి చెట్టు మీద మరో వృక్షం ఉన్నట్లు కనిపిస్తోంది. 

Source: Eenadu

ఇదేంటి బాతు ఆకుపచ్చగా ఉందేంటి అనుకుంటున్నారా.. అది నిజమైన బాతు కాదు.. ఆ ఆకారంలో ఉన్న దోసకాయ. మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన రైతు సూరారపు లచ్చయ్య వేసిన పంటలో ఓ దోసకాయ ఇలా బాతు ఆకారంలో ఉండటంతో పరిసర రైతులు, గ్రామస్థులు ఆసక్తిగా తిలకించారు.

Source: Eenadu

కొండపైన బిర్లామందిర్‌.. దిగువన నిర్మాణంలో ఉన్న సచివాలయం.. రెండూ ఒకదానిపైన ఒకటి ఉన్నట్లుగా ఉంది కదూ.. నెక్లెస్‌రోడ్డు నుంచి చూస్తే ఇలా కనిపిస్తూ కనువిందు చేస్తోంది.

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home