చిత్రం చెప్పే విశేషాలు!

(16-11-2022/2)

ఉక్రెయిన్‌లో ఓ క్షిపణి నేరుగా ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఫొటోను ఉక్రెయిన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసింది. తమ దేశంలో ప్రతిరోజు ఇలాగే సాగుతోందని.. తామూ దీనికి అలవాటు పడినట్లు తెలుపుతూ పోస్టు పెట్టింది.

Source: Eenadu

ప్రముఖ సినీనటుడు అనుపమ్‌ ఖేర్‌.. క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి, అనుష్కశర్మ దంపతులను విమానాశ్రయం లాంజ్‌లో కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ట్విటర్‌లో పంచుకున్నారు అనుపమ్‌ ఖేర్‌.

Source: Eenadu

తెదేపా అధినేత చంద్రబాబునాయుడు బుధవారం కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

Source: Eenadu

ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ మత సామరస్యాన్ని చాటుకున్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని మణికంఠ కుటీరంలో అయ్యప్ప స్వాములకు బుధవారం ఆమె అన్నదానం చేశారు. వారితో కలిసి తిన్నారు.

Source: Eenadu

భారత్, న్యూజిలాండ్‌ మధ్య ఈ నెల 18నుంచి మూడు టీ20 మ్యచ్‌ల సిరీస్‌ జరగనుంది. ఈ సందర్భంగా ఇరు దేశాల కెప్టెన్లు హార్దిక్‌ పాండ్య, కేన్‌ విలియమ్సన్‌ ఇలా ఫొటోషూట్‌లో పాల్గొన్నారు.

Source: Eenadu

నాసా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్‌-1ను ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి బుధవారం విజయవంతంగా లాంచ్‌ చేసింది. మధ్యాహ్నం రాకెట్‌.. చంద్రుడి వైపు దూసుకెళ్లింది.

Source: Eenadu

జీ20 సదస్సులో భాగంగా బాలి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ ఇతర సభ్యదేశాల అధినేతలతో కలిసి అక్కడి అడవిలో మొక్కలు నాటారు.

Source: Eenadu

కేంద్ర మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వ‌చ‌నం చేశారు.

Source: Eenadu

గమనిక: ఇది ప్రయత్నించకండి

బాక్సర్‌ మీనాక్షి

ఈవీఎంలు ఇలా పుట్టుకొచ్చాయి!

Eenadu.net Home