చిత్రం చెప్పే విశేషాలు!
(26-07-2022/1)
ప్రాథమిక బడుల్లోని 3, 4, 5 తరగతులను కిలోమీటరు దూరంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతో కొన్నింటిలో తరగతికి ఒకరిద్దరు విద్యార్థులే మిగులుతున్నారు.
Source: Eenadu
ఈ చిత్రంలో ఉన్న పెన్నును భూమిలో పడేస్తే.. దాని నుంచి మూడు రకాల మొక్కలు మొలుస్తాయి. అనంతపురం నగరానికి చెందిన ఏజీఎస్ ట్రస్టు ఆధ్వర్యంలో వీటిని ప్రభుత్వ పాఠశాలల్లో పంపిణీ చేస్తున్నారు. పెన్ను పైభాగంలో మట్టిలో కలిసిపోయే గుణమున్న ఓ క్యాప్సుల్ ఉంటుంది.
Source: Eenadu
అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం గోనెబావి గ్రామంలో బాలికల గురుకుల పాఠశాల భవన నిర్మాణం పనులు రెండున్నరేళ్లుగా నిలిచిపోయాయి. దీంతో సుమారు 400 మంది విద్యార్థినులకు గుమ్మఘట్టలోని కంబళ్ల సొసైటీకి చెందిన రెండు షెడ్లలో తరగతులు నిర్వహిస్తున్నారు.
Source: Eenadu
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో తాజ్‌మహల్ వద్ద సోమవారం ఫొటోకు ఫోజిచ్చిన మిస్ టీన్ ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొంటున్న అందగత్తెలు.
Source: Eenadu
రాష్ట్రపతిగా గిరిపుత్రిక ద్రౌపదీ ముర్ము ప్రమాణ స్వీకార వేడుకను ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గిరిజనులు ఎంతో గర్వంతో వీక్షించారు. అంకాపూర్‌లో అలా ముర్ము ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని టీవీలో తిలకిస్తున్న ఆదివాసీల చిత్రాన్నే మీరు చూస్తున్నది.
Source: Eenadu
వైఎస్సార్ బీమా ఉండి చనిపోయిన వ్యక్తి కుటుంబానికి తక్షణ సాయంగా రూ.20వేలు అందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం హ్యాప్ పే కార్డులను అందజేయనుంది.
Source: Eenadu
ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో జరిగే స్పందన కార్యక్రమానికి వచ్చిన వీరంతా తమ సమస్యల దరఖాస్తును పాడుపడిన పెంకుటిల్లు కింద నిల్చుని ఆన్‌లైన్ చేయించుకుంటున్నారు. ఎప్పుడు ఏ పెంకు రాలి మీద పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
Source: Eenadu
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఆవరణంతా బురదమయంగా మారింది. సోమవారం రోజున స్పందన కార్యక్రమానికి వచ్చిన అధికారులు వాహనాలు, జనాలు బురద వల్ల అవస్థలు పడ్డారు.
Source: Eenadu
కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజీ వద్ద సోమవారం వరద ఉద్ధృతి కొంత తగ్గింది. ఈ కారణంగా బ్యారేజీ 20 గేట్లను మూసివేశారు. రాత్రి 9 గంటలకు 50 గేట్లను ఒక అడుగు మేర ఎత్తారు.
Source: Eenadu