చిత్రం చెప్పే విశేషాలు..!

(15-08-2022/1)

20 టన్నుల తాజా కూరగాయాలు పేర్చి.. 7,625 చ.అడుగుల విస్తీర్ణంలో సృష్టించిన జాతీయ జెండా ఆకారం బెంగళూరులో ఆకట్టుకుంది. స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని వేకూల్‌ సంస్థ ఈ ప్రయత్నం చేసింది.

Source: Eenadu

పాకిస్థాన్‌ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా పంజాబ్‌లోని వాఘా సరిహద్దు వద్ద ఆదివారం భారత జవాన్లకు మిఠాయిలు పంచుతున్న ఆ దేశ సైనికులు

Source: Eenadu

పంజాబ్‌లోని జలంధర్‌లో జాతీయ జెండాలు చేతబూని నర్మదా నదిలో ఈత కొడుతున్న యువకులు.

Source: Eenadu

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా దిల్లీలో ఆదివారం నిర్వహించిన ‘హర్‌ ఘర్‌ తిరంగా’ యాత్రలో పాల్గొన్న విద్యార్థులు.

Source: Eenadu

కొన్ని గిరిజన ప్రాంతాల్లో గర్భిణులను, అనారోగ్యానికి గురైన వారిని అక్కడి ప్రజలు డోలి కట్టి భూజాలపై మోసుకెళ్తుంటారు. వారికి భారం తగ్గించే విధంగా మహబూబ్‌నగర్‌ జిల్లా కంబాలపల్లికి చెందిన షణ్ముఖరావు సైకిల్‌ చక్రాలను ఉపయోగించి ఈ పరికరాన్ని తయారు చేశారు.

Source: Eenadu

ఎల్‌.బీ.నగర్‌ హస్తినాపురం సంతోషిమాత కాలనీకి చెందిన సూక్ష్మ కళాకారుడు డాక్టర్‌ ముంజంపల్లి విద్యాధర్‌ 48 గంటలపాటు శ్రమించి నువ్వు గింజపై ఒకవైపు మువ్వన్నెల జెండా, మరోవైపు హిందీలో మేరా భారత్‌ మహాన్‌ రాసి దేశభక్తిని చాటారు.

Source: Eenadu

కుత్బుల్లాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనానికి స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఉట్టిపడేలా అలకరించుకొని తిరుగుతూ సుచిత్రా కూడలి వద్ద కన్పించాడు.

Source: Eenadu

తెలంగాణ నిర్మల్‌లోని గాంధీచౌక్‌- కాల్వగడ్డ ప్రాంతంలో నివసించే నూకల అశోక్‌ ఇంటిపై గాంధీజీ విగ్రహం ఉంటుంది. ఆయన తాతయ్య నూకల విఠల్‌కు గాంధీ అంటే వల్లమాలిన అభిమానం. అందుకే విగ్రహం ఏర్పాటు చేశారట. ఆయన వారసులు గాంధీ విగ్రహం వద్ద జాతీయజెండాను ఎగరేశారు.

Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

వదిలేయాల్సింది మీ కలలను కాదు

Eenadu.net Home