చిత్రం చెప్పే విశేషాలు!

(20-11-2022/2)

హాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా భావించే గవర్నర్స్‌ అవార్డు ప్రదానోత్సవంలో రాజమౌళి పాల్గొన్నారు. లాస్‌ ఏంజెలెస్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జక్కన్న.. స్టార్‌ వార్స్, మిషన్‌ ఇంపాజిబుల్‌ సినిమాల దర్శకుడు జేజే అబ్రమ్స్‌ను కలిశారు. 

Source: Eenadu

తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో జగనన్న స్వర్ణోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కళాకారులతో కలిసి మంత్రి రోజా స్టెప్పులేసి సందడి చేశారు.

Source: Eenadu

తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఆదివారం ధ్వజారోహణంతో ప్రారంభించారు. ఇందులో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

Source: Eenadu

చిరంజీవి హీరోగా బాబీ (కేఎస్‌ రవీంద్ర) తెరకెక్కిస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌‘ ‘బాస్ పార్టీ’ పాటను నవంబర్‌ 23న సాయంత్రం 4.05గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

Source: Eenadu

కాకినాడలోని జేఎన్‌టీయూ ఆవరణలో పాఠశాల విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసే ఉద్దేశంతో రాష్ట్రస్థాయి క్రియ పండగ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు విద్యార్థులు వివిధ వేషధారణల్లో కనిపించి ఆకట్టుకున్నారు.

Source: Eenadu

అన్నమయ్య డ్యామ్‌ జల విలయానికి గురైన పులపుత్తూరు గ్రామంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటించి బాధితులను పరామర్శించారు. డ్యామ్‌ కొట్టుకుపోయి ఏడాది అయినా ముంపు గ్రామాల ప్రజలకు నేటికీ సరైన సాయం అందలేదని ఆయన అన్నారు.

Source: Eenadu

యువ కథానాయకుడు నాగశౌర్య వివాహం వేడుకగా జరిగింది. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్‌ డిజైనర్‌ అనూష శెట్టి మెడలో అతడు మూడు ముళ్లు వేశాడు. బెంగళూరులోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో జరిగిన వీరి వివాహానికి ఇరు కుటుంబ పెద్దలు, సన్నిహితులు హాజరయ్యారు.

Source: Eenadu

గుజరాత్‌లోని ప్రసిద్ధ సోమనాథ్‌ దేవాలయాన్ని ప్రధాని నరేంద్రమోదీ దర్శించుకున్నారు. ఆలయంలోని మూలవిరాట్‌కు అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.

Source: Eenadu

బద్దలైన అగ్నిపర్వతం..

చిత్రం చెప్పే విశేషాలు!(04-12-2022/2)

చిత్రం చెప్పే విశేషాలు..!(04-12-2022/1)

Eenadu.net Home